మోడీని విచారించలేం: గోద్రాపై అమెరికా, పైకోర్టుకెళ్తామని
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన అమెరికా కోర్టుల పరిధిలో విచారణ జరపలేమని ఆ దేశ ప్రభుత్వ న్యాయవాది ప్రీత్ బరారా తెలిపారు. ఒక విదేశీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అధినేతగా ఆయనకు అమెరికా కోర్టుల నుండి మినహాయింపు లభిస్తుందని చెప్పారు.
ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీ పైన ఆరోపణలు చేస్తూ అమెరికన్ జస్టిస్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా బరారా సోమవారం వివరాలు తెలిపారు.
దీని పైన అమెరికన్ జస్టిస్ సెంటర్ న్యాయవాది గుర్‌పత్వంత్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు విచారణ నుండి మినహాయింపు అన్న వాదన అమెరికా చట్టాలకు, మానవ హక్కుల విధానాలకు వ్యతిరేకమని తెలిపారు. దీనిని న్యాయస్థానంలో సవాల్ చేస్తామన్నారు.

ఆస్ట్రేలియా పార్లమెంటులో మోడీ ప్రసంగం
మోడీ వచ్చేనెలలో ఆస్ట్రేలియా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్లు, నాయకుల సంయుక్త సభలో ప్రసంగించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. వచ్చే నెలలో బ్రిస్బెన్‌లో జరిగే జి-20 దేశాధినేతల సమావేశానికి హాజరుకానున్న ప్రధాని తరువాత ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగిస్తారు.
మోజీ హిందీలోనే మాట్లాడనున్నారని తెలుస్తోంది. పలు దేశాల్లో కూడా ప్రధాని హందీనే మాట్లాడారని, ఇక్కడ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారంటున్నారు. మోడీ హిందీలోనే మాట్లాడుతన్నారంటే దాని అర్థం ఆస్ట్రేలియాలో భారతీయుల సంస్కృతి అలాగే ఐక్యతను చాటిచెప్పడానికేనని తస్మానియా లేబర్‌పార్టీ సెనెటర్ లీసా సింగ్ స్పష్టం చేశారు.
అలాగే మోడీ హిందీ ప్రసంగం భారత్ ఔన్నత్యాన్ని మరింత పెంచుతుందని 42 ఏళ్ల సింగ్ అన్నారు. లీసా సింగ్ ఆస్ట్రేలియా ఫెడర్ పార్లమెంటు తొలి ప్రవాస భారతీయురాలు. పార్లమెంటులో మాతృభాషలో ప్రసంగించడం వల్ల ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయుల గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. పలుదేశాల్లో మోడీ మాతృ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షనీయమన్నారు.
తాము దాన్ని గౌరవిస్తున్నట్టు సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల భారత్‌లో తాను భారత్‌లో పర్యటించిన సందర్భంలో ఓ కొత్త అనుభూతిని పొందానని, మోడీపై దేశ ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్న భావన కలిగిందన్నారు. నవంబర్ 15-16 తేదీల్లో బ్రిస్బెన్‌లో జి-20 దేశాధినేతలు శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, చైనా ప్రధాని జీ జిన్‌పింగ్ హాజరవుతున్నారు. తరువాత ఆస్ట్రేలియా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు.
-
అమెరికాకు గుడ్ బై చెప్తే.. భారీగా డబ్బు, ఫ్రీ ఫ్లైట్ టికెట్ -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications