బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళ ప్రీత్ కౌర్

Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్‌ ఎన్నికల్లో ఓ సిక్కు మహిళ చరిత్రాత్మక విజయం సాధించి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కాగా, బ్రిటన్‌ పార్లమెంటుకు ఎన్నికైన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమే ప్రస్తుత సండ్వెల్లి కౌన్సిలర్ ప్రీత్ కౌర్ గ్రిల్.

ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి చెందిన ప్రీత్‌కౌర్‌ గ్రిల్‌ బర్మింగ్‌హామ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ నుంచి పోటీ చేసి 24,124 ఓట్లు సాధించి ఎంపీగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి కరోలిన్‌ స్క్వైర్‌పై గ్రిల్‌ 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు.

Preet Kaur Gill becomes first female Sikh MP in UK

ఎడ్జ్‌బాస్టన్‌కు ఎంపీగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
ఎడ్జ్‌బాస్టన్‌ ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. బ్రిటన్ పార్లమెంటులో తొలిసారి అడుపెడుతండటం తనకు ఆనందంగా ఉందని ప్రీత్ కౌర్ చెప్పారు.

కాగా, అదే పార్టీకి చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్‌మన్‌జీత్‌ సింగ్‌ దేశి కూడా కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిపై 16,998 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. స్లోగ్‌ సీటు నుంచి తన్‌మన్‌జీత్‌ పోటీ చేసి 34,170 ఓట్లు సాధించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిక్కులకు అవకాశం ఇచ్చినందుకు లేబర్‌ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మరో సిక్కు అభ్యర్థి కుల్దీప్‌ సహోతా ప్రత్యర్థి చేతిలో 720 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఇద్దరు సిక్కు అభ్యర్థులు గెలుపొందడం ఇదే తొలిసారి. కాగా, బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో 56మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు పోటీ చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Councillor from Sandwell, Preet Kaur Gill, on Friday, became first female Sikh MP to be elected to the UK House of Commons.
Please Wait while comments are loading...