• search

కిమ్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, మేలో ఇద్దరి మధ్య ముఖాముఖీ

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వాషింగ్టన్‌ : అమెరికా, ఉత్తర కొరియా మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం సమసిపోయే సంకేతాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చలకు మార్గం సుగమమైంది. ట్రంప్‌ని చర్చలకు ఆహ్వానిస్తూ గురువారం శ్వేతసౌధాన్ని సందర్శించిన దక్షిణ కొరియా ప్రతినిధులు కిమ్‌ పంపిన లేఖను అందజేశారు.

  ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్న చర్చల సారాంశాన్ని ట్రంప్‌కు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ట్రంప్‌ ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు. కిమ్‌తో దక్షిణ కొరియా ప్రతినిధులు, అణు క్షిపణుల నియంత్రణకు జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ తెలిపారు.

  kim-trump

  ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు దూరంగా ఉండటాన్ని కూడా ట్రంప్ స్వాగతించారు. ఒప్పందాలు కుదిరే వరకు ఇది ఇలాగే కొనసాగాలన్నారు. సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ట్రంప్‌, కిమ్‌ల మధ్య మేలో ముఖాముఖీ భేటీ జరిగే అవకాశం ఉంది.

  ప్రపంచానికి పెద్దన్నగా చలామణీ అవుతున్న అమెరికాకు, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇన్నాళ్లూ కొరకరాని కొయ్యలా తయారైన సంగతి తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్‌, కిమ్‌ల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది.

  కిమ్‌ కూడా ఏ మాత్రం తగ్గకుండా తమ అణు క్షిపణులతో ప్రపంచానికే పెను సవాలు విసురుతూ వచ్చారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ శాంతి చర్చల ద్వారా వివాదానికి తెర దించాలని ఇరు దేశాలకు సూచించాయి. దీంతో ఈ ఏడాది ఆరంభం నుంచి కిమ్‌ వైఖరిలో మార్పు చోటుచేసుకుంది.

  దీంతో క్రమంగా ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు సడలాయి. ఇటీవలే పొరుగు దేశమైన దక్షిణ కొరియా అధికారులు చర్చల కోసం దశాబ్ధ కాలం తర్వాత ఉత్తర కొరియాలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే కిమ్‌ సోదరి దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్స్‌కి హాజరవడంతో, చర్చలు సత్ఫాలితాలు ఇచ్చే సంకేతాలు వెలువడ్డాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  President Donald Trump agreed on Thursday to meet with North Korean dictator Kim Jong Un by May after Kim pledged to refrain from further nuclear tests and move toward denuclearization, according to South Korean officials.The surprise announcement was made by South Korean National Security Advisor Chung Eui-Yong in a short statement outside the White House. The White House later said no firm timetable was set. Chung said that in recent talks with South Korea, Kim Jong Un "expressed eagerness to meet President Trump as soon as possible." A senior administration official said the sentiments from Kim were conveyed verbally to Trump during a briefing in the Oval Office at the White House on Thursday, denying the existence of a physical letter from the South Korean envoy to the president, which was reported earlier.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  ఎన్నికల ఫలితాలు 
  మధ్యప్రదేశ్ - 230
  PartyLW
  CONG10012
  BJP9415
  IND41
  OTH40
  రాజస్థాన్ - 199
  PartyLW
  CONG3464
  BJP3044
  IND85
  OTH311
  ఛత్తీస్‌గఢ్ - 90
  PartyLW
  CONG3532
  BJP123
  BSP+71
  OTH00
  తెలంగాణ - 119
  PartyLW
  TRS285
  TDP, CONG+021
  AIMIM07
  OTH13
  మిజోరాం - 40
  Party20182013
  MNF265
  IND80
  CONG534
  OTH10
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more