Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మానవాళికి అతి పెద్ద సవాల్- ప్రధాని మోదీ ఆందోళన

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఏర్పాటైన జీ20 లీడర్స్ సమ్మిట్ రెండవ సెషన్‌లో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. పలు అంశాలను ప్రస్తావించారు. ఉగ్రవాదం అణచివేత, వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం- పరస్పర సహకారం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విపత్తుల దుష్ప్రభావాలు పెరుగుతున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మానవాళికి పెద్ద సవాలుగా పరిణమించాయని అన్నారు. ఈ రంగంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడానికి, తన 2023 జీ20 అధ్యక్షతన జరిగిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చినందుకు దక్షిణాఫ్రికాను ప్రశంసించారు.

Prime Minister Modi Urges G20 Nations to Embrace Inclusive and Sustainable Development Models

విపత్తులు మానవాళికి పెద్ద సవాలుగా మారుతున్నాయని, ఈ సంవత్సరం కూడా మెజారిటీ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు. ఈ సంఘటనలు- విపత్తులను ఎదుర్కోవడంపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోన్నాయని అన్నారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని, ఈ ముఖ్యమైన అజెండాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు దక్షిణాఫ్రికాను అభినందిస్తున్నానని చెప్పారు.

విపత్తులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి క్విక్ రియాక్షన్ ఆధారిత విధానం నుండి అభివృద్ధి-కేంద్రీకృత విధానానికి మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఉపగ్రహాలను వినియోగించుకోవాల్సి ఉందని, అంతరిక్ష సాంకేతికత మానవాళికి ఉపయోగపడాలనేది తమ ఉద్దేశమని అన్నారు. ఉపగ్రహ డేటాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కోసం అనుకూలంగా మార్చడానికి జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్టనర్‌షిప్‌ను ప్రతిపాదించారు.

జీ20 సభ్య దేశాల అంతరిక్ష సంస్థల నుండి ఉపగ్రహ డేటా, అనాలసిస్ ను మరింత అందుబాటులోకి తీసుకుని రావడం ఉపయోగకరంగా మారుస్తుందని అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లోని దేశాలకు ఇది అత్యవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా నిలకడగా అభివృద్ధి సాధించడానికి విపత్తులను విజయవంతంగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్‌ను ప్రతిపాదించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+