Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రిటన్‌లో మోడీ ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం

లండన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను విజయవంతం చెయ్యడానికి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) సిద్దమయ్యారు. నెల రోజుల పాటు బ్రిటన్ లోని ప్రసిద్ధి చెందిన ప్రాంతాలలో మోడీ ఎక్స్ ప్రెస్ పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు.

ఆదివారం ఈ యాత్ర ప్రారంభమైందని నరేంద్ర మోడీ స్వాగత కమిటి ప్రతినిధి మయూరి పార్కర్ తెలిపారు. బ్రిటన్‌లో లిటిల్ ఇండియాగా ప్రఖ్యాంతి గాంచిన వెంబ్లే లోని ఈ లింగ్ రోడ్డుకు ముందుగా ఈ బస్సు చేరుకుంటుంది. తరువాత బ్రిటన్ లో ప్రసిద్ధి చెందిన నగరాలలో సంచరిస్తుంది.

Prime Minister Narendra Modi Express bus launched in UK

దీపావళి పండగ నాటికి టాఫల్ గర్ స్క్వేర్ కు ఈ బస్సు చేరుకుంటుందని వివరించారు. వచ్చే నెల ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారి బ్రిటన్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బస్సు పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ప్రవాస భారతీయులు చెప్పారు.

నవంబర్ 13వ తేదిన వెంబ్లే స్టేడియంలో మోడీకి ఒలంపిక్స్ తరహాలో స్వాగతం చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే వందలాది మంది ప్రవాస భారతీయులు వారి పేర్లు నమోదు చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+