వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిన్సెస్ లతీఫా: బందీగా మారిన దుబయి రాకుమార్తె బతికే ఉన్నారా.. ఆ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలు ఏం చెబుతున్నాయి.. ఆమె ఎక్కడున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దుబయి పాలకుడు కుమార్తె ప్రిన్సెస్ లతీఫా తన స్నేహితులతో కనిపిస్తున్న ఓ ఫోటోను రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఇటీవల పోస్ట్ చేశారు. అంతకు కొన్నినెలల ముందు నుంచి లతీఫా కనిపించడం లేదు.

latifa

గత ఫిబ్రవరిలో లతీఫా మాట్లాడుతున్న సీక్రెట్ వీడియోను 'బీబీసీ పనోరమ’ ప్రసారం చేసింది. తనను నిర్బంధించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని లతీఫా ఆ వీడియోలో చెప్పారు.

తాజా ఫోటోను బీబీసీ ధ్రువీకరించలేదు. ఈ ఫోటోకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు.

ఈ ఫోటోను అనుకోకుండా పోస్ట్ చేయలేదని, ఆమె అదృశ్యానికి సంబంధించిన అంశాలతో దీనికి సంబంధముందని బీబీసీ భావిస్తోంది.

''ఆమె విషయంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నట్లు మేం ధ్రువీకరిస్తున్నాం. ఈ దశలో ఇంతకుమించి మేం మాట్లాడలేం. తగిన సమయంలో పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేస్తాం’’అని ఫ్రీ లతీఫా క్యాంపెయిన్ గ్రూప్ కో ఫౌండర్ డేవిడ్ హై చెప్పారు.

బీబీసీ అడిగిన ప్రశ్నలకు లండన్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎంబసీ స్పందించలేదు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా ఫోటోపై స్పందించేందుకు నిరాకరించింది. ''లతీఫా జీవించి ఉన్నారనే రుజువు చేసే ఆధారాల కోసం మేం ఎదురుచూస్తున్నాం’’అని తెలిపింది. యూఏఈ ఈ ఆధారాలను ఐరాసకు సమర్పించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Princess Latifa: Is the captive Dubai princess alive? What do those Instagram photos say? Where is she
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X