సివోల్ ఫెర్రీ నౌక ప్రమాదం: కెప్టెన్‌కు మరణ శిక్ష
న్యూఢిల్లీ: దక్షిణకొరియాలో గత ఏప్రిల్‌లో జరిగిన సివోల్ ఫెర్రీ నౌక ప్రమాదంలో బాధ్యరహితంగా వ్యవహరించినందుకు గాను కెప్టెన్ లీ జూన్ సియోక్‌కు మరణ శిక్ష విధించాలని కోర్టులో విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు.
ఏప్రిల్‌లో దక్షిణ కొరియా దక్షిణ తీరంలో 476 మంది ప్రయాణికులతో విహార యాత్రకు వెళ్లి వస్తుండగా నౌక ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 174 మంది మాత్రమే రక్షించబడ్డారు. కెప్టెన్ లీ జూన్ సియోక్ నిర్లక్ష్యంగా మునుగుతున్న ప్రయాణికులను పట్టించుకోకుండా, అందరి కంటే ముందుగా సిబ్బందితో కలిసి రెస్క్యూ పడవలలోకి ఎక్కేశాడు.
300 మంది మృతికి కారకులైన కెప్టెన్‌కు మరణ శిక్ష, 13 మంది సిబ్బందికి జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూటర్లు కోరుతున్నారు. దక్షిణ కొరియాలో సముద్రంలో మునిగిపోయిన నౌక కెప్టెన్ లీ జూన్ సియోక్‌తో పాటు, మరో ఇద్దరు క్రూ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మొత్తం 476 మందితో వెళుతున్న నౌక సముద్రంలో ఒరిగిపోతున్నా ప్రయాణికులను ఖాళీ చేయించడంపై ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడాన్ని కెప్టెన్ సమర్థించుకున్నారు. ప్రమాద సమయంలో సరిగ్గానే వ్యవహరించానని చెప్పుకొచ్చారు.
సముద్ర చట్టాలను ఉల్లంఘించి ప్రయాణికుల భద్రతలో వైఫల్యం చెందినందుకు, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కెప్టెన్‌పై కేసు నమోదు చేశారు ఆ దేశ పోలీసులు. నౌకలో 300 మందికి పైగా స్కూలు విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గాను మంత్రి మండలిని కూడా పునర్వ్య వస్థీకరించింది.












Click it and Unblock the Notifications