మాజీ ప్రధాని ఇంటికి నిప్పు.. భార్య సజీవ దహనం
నేపాల్ అతలాకుతలం అవుతోంది. నేపాల్ లో సోషల్ మీడియా నిషేధంపై దేశ ప్రజలు ముఖ్యంగా యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఉద్యమకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన దాడిలో 12 ఏళ్ల బాలుడితోపాటు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 347 మందికి గాయాలు అయ్యాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. మరోవైపు నేపాల్ లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో రెండు రోజులుగా ఉద్ధృతంగా సాగుతున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. వారితోపాటు హోం మంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి సహా ఐదుగురు మంత్రులు రాజీనామా చేశారు.
తాజాగా నేపాల్ లో దారుణం జరిగింది. నేపాల్ మాజీ ప్రధాని ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పటించారు. ఇంటిలో ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రా కార్ సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. నిరసనకారులు ఆమెను తన ఇంట్లో బంధించి ఇంటికి నిప్పటించారు. కాలిన గాయాలతో ఆమె మరణించారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినా నేపాల్ లో మాత్రం ఆందోళనలు సద్దుమణగలేదు.
Former Nepal PM Jhalanath Khanal’s wife — Rajyalaxmi Chitrakar — BURNED ALIVE
— RT (@RT_com) September 9, 2025
She sustained severe injuries in a fire at their residence caused by protesters — India Today https://t.co/EV5h7Z07D9 pic.twitter.com/61Dr8vjpPd
నిరసనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంతో పాటు అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి నిప్పటించారు. అంతేకాక నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్ పై నిరసనకారులు దాడి చేశారు. అతడ్ని కిందపడేసి కాళ్లతో తన్నారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఇక ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయడంతో నేపాల్ లో పాలన పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయి. రాజీనామాకు ముందే కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో సంభాషించినట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఓలీ దుబాయ్ కు వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు నేపాల్ లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications