మిత్ర దేశాలకు పుతిన్ అర్జంట్ ఫోన్ కాల్- భారత్ సహా: మాస్కోను ఖాళీ చేసిన మాజీ అధ్యక్షుడు
మాస్కో: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అంతర్యుద్ధం మొదలైందక్కడ. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కుడిభుజంలా ఉంటూ వచ్చిన వాగ్నర్ మెర్సినరి గ్రూప్.. తిరుగుబాటును లేవనెత్తింది. రష్యా సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడమే దీనికి కారణమైంది. ఈ ఘటన తరువాత వాగ్నర్ గ్రూప్ అడ్డం తిరిగింది. అంతర్యుద్ధాన్ని మొదలుపెట్టింది.
కొన్ని గంటల వ్యవధిలోనే ఇది ఉధృత రూపాన్ని దాల్చింది. రెండు నగరాలు- రొస్టొవ్, వొరొనెజ్‌ను సైతం వాగ్నర్ గ్రూప్ సొంతం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా నగరాల్లో పహారాలో ఉన్న రష్యా సైనికులు- ఈ ప్రైవేట్ ఆర్మీకి లొంగిపోయింది. వొరొనెజ్ టౌన్ శివార్లలోని ఆయిల్ డిపో ధ్వంసమైంది. ఇందులో నుంచి దట్టమైన పొగలు వెలువడటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల‌్‌గా మారాయి.

ఈ పరిణామాల మధ్య పుతిన్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తిరుగుబాటును అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. తిరుగుబాటుదారులను అణచివేస్తామని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని అన్నారు. తిరుగుబాటుకు సిద్ధపడిన వారందరికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. తిరుగుబాటుదారులకు నాయకత్వాన్ని వహిస్తోన్న వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు.
దీని తరువాత ఆయన మిత్ర దేశాలకు ఫోన్ కాల్ చేశారు. వారి నుంచి సైనిక సహాయాన్ని కోరారు. సహకారాలను కోరుకుంటోన్నారు. ఈ మేరకు ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, బెలారస్ అధ్యక్షులకు ఫోన్ చేశారు పుతిన్. తమ దేశానికి సైన్యాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. రష్యాలో నెలకొన్న తాజా పరిణామాలను వారికి వివరించారు. ఉజ్బెక్, కజక్, బెలారస్ అధ్యక్షులు షౌకత్ మిర్జియోయెవ్, కస్సిం జొమార్ట్ తకయోవ్, అలెగ్జాండర్ లుకషెన్కోతో ఫోన్‌లో మాట్లాడినట్లు క్రెమ్లిన్ తెలిపింది.
తనతో సుదీర్ఘకాలంగా మిత్రత్వాన్ని కొనసాగిస్తోన్న దేశాలకు పుతిన్ ఫోన్ కాల్ చేస్తారని తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు సమాచారం. భారత్‌కు ఆయన ఇంకా ఫోన్ చేయలేదని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, బెలారస్ అధ్యక్షులతో మాట్లాడారని, రష్యాలో నెలకొన్న పరిణామాలను వివరించారని స్పష్టం చేస్తోన్నాయి.

మాస్కో నగరానికి వాగ్నర్ గ్రూప్ సమీపిస్తోందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో- స్థానిక భద్రత సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రజలెవరూ తమ ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదెవ్.. మాస్కోను ఖాళీ చేశారు. సెయింట్ పీటర్స్ బర్గ్‌కు ఆయన తన కుటుంబంతో సహా తరలివెళ్లినట్లు వార్తలు వస్తోన్నాయి.
బయలుదేరి వెళ్లే ముందు ఆయన తన అధికారిక టెలిగ్రామ్‌లో కీలక వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. మాతృభూమిని స్వాధీనం చేసుకోవడానికి, ఆకలితో ఉన్న శక్తులు ప్రయత్నిస్తోన్నాయని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని అన్నారు. అంతర్గత శత్రువులకు కొన్ని బయటి శక్తులు సైతం తోడయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ మూకుమ్మడిగా ఓడించాలని పిలుపునిచ్చారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications