వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్‌తో సంబంధం తెంచుకోం.. ఎందుకంటే: ఖతార్

ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న ఆరోపణలతో ఖతార్‌తో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు తెగతెంపులు చేసుకున్నాయి. దీనిపై ఖతార్ మరోసారి స్పందించింది.

|
Google Oneindia TeluguNews

దోహా: ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న ఆరోపణలతో ఖతార్‌తో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు తెగతెంపులు చేసుకున్నాయి. దీనిపై ఖతార్ మరోసారి స్పందించింది.

ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్న ఇస్లామిక్ స్టేట్స్, అల్ ఖైదా, లెబనెసీ షియా టెర్రరిస్ట్‌ గ్రూప్‌ హెచ్‌బొల్లాలతో తాము తెగదెంపులు చేసుకోమని, ఎందుకంటే అలాంటి సంబంధాలే అసలు లేవు కనుక అని ఖతార్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐసిస్‌ను బహిష్కరించలేం.. ఎందుకంటే..

ఐసిస్‌ను బహిష్కరించలేం.. ఎందుకంటే..

అరబ్‌ దేశాలు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌ను దేశం నుంచి బహిష్కరించలేమని, ఎందుకంటే.. అలాంటి వారు ఖతార్‌లో లేరని పేర్కొంది.

దౌత్య సంక్షోభంలో ఖతార్

దౌత్య సంక్షోభంలో ఖతార్

కాగా, అరబ్ దేశాలు ఖతార్‌తో తెగతెంపులు చేసుకోవడంతో ఆ దేశం దౌత్య సంక్షోభంలో చిక్కుకుంది. ఈ పరిస్థితి నుంచి ఖతార్‌ బయటపడాలంటే ఉగ్రవాద సంస్థలతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని అరబ్‌ దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన లేఖను ఖతార్‌కు పంపించాయి. అయితే వీటిపై అమెరికా, కువైట్‌లతో చర్చిస్తున్న ఖతార్‌.. ఉగ్రవాద ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

మాకూ కండిషన్స్..

మాకూ కండిషన్స్..

అరబ్‌ దేశాలు పంపిన డిమాండ్లపై తాము అమెరికా, కువైట్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఖతార్ తెలిపింది. డిమాండ్లను అంగీకరించాలంటే తమ వద్ద కూడా కొన్ని కండిషన్స్‌ ఉన్నాయని పేర్కొంది. అరబ్‌ దేశాలు పేర్కొన్న డిమాండ్లు చాలా అనుచితంగా ఉన్నాయని, అంతేగాక వాటిపై సమాధానం చెప్పేందుకు డెడ్‌లైన్‌ పెట్టడం అంటే అది ఖతార్‌ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించినట్లేనని తెలిపింది.

ఓ అవకాశం

ఓ అవకాశం

ఖతార్‌తో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి. ఖతార్‌ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే సంబంధాలు పునరుద్ధరించేందుకు ఖతార్‌కు ఓ అవకాశాన్నిచ్చాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తెంచుకోవాలని, అల్‌ జజిరా టీవీ ఛానల్‌ను మూసివేయాలని ఇలా 13 డిమాండ్లతో కూడిన లేఖను పంపించాయి. దానిపై 10 రోజుల్లోగా స్పందించాలని స్పష్టం చేశాయి. ఈ ఆదివారంతో గడువు ముగియనుంది.

English summary
Qatar said on Thursday it was working with the United States and Kuwait to respond to a list of demands presented by Arab states who have accused Doha of supporting terrorism, an allegation that ignited a regional crisis between the U.S. allies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X