వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షీణించిన క్విన్ ఎలిజబెత్-2 ఆరోగ్యం..? విశ్రాంతి అవసరం అంటోన్న వైద్యులు..

|
Google Oneindia TeluguNews

క్విన్ ఎలిజబెత్-2 ఆరోగ్యం క్షీణించిందట. ఆమె ఆరోగ్యం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సిఫారసు చేశారు. దీంతో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఈ అక్టోబర్ నుంచి ఎలిజబెత్ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 96 ఏళ్ల ఎలిజబెత్ నిలబడటానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. బుధవారం ఆమె తన సీనియర్ రాజకీయ సలహాదారులతో సమావేశం అయ్యారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఎలిజబెత్ అనారోగ్యం గురించి తెలిసి.. ప్రిన్స్ చార్లెస్, విలియం బాల్మొరల్ వెళుతున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలిజబెత్ ఆరోగ్యంగానే ఉన్నారని.. విశ్రాంతి తీసుకుంటున్నారని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. రాణి ఆరోగ్యం గురించి ప్యాలెస్ ప్రకటన చేయడం రేర్.. దీంతో నిజంగా ఏం జరుగుతుందోననే ఆందోళన ఉంది. కొద్దీ సేపటి ముందు ప్రధాని లిజ్ ట్రస్, సీనియర్ సభ్యులు ఛాంబర్ నుంచి వెంటనే బయల్దేరారు.

Queen Elizabeths Doctors Concerned Over Health

బ్రిటన్‌లో రాజరిక పాలన అమల్లో ఉన్నప్పటికీ.. చట్టబద్దంగా ఎన్నుకున్న ప్రధానమంత్రే.. వారి నేతృత్వంలోని మంత్రివర్గం విధానపర నిర్ణయాలు తీసుకుంటారు.

English summary
Queen Elizabeth II after Buckingham Palace said her doctors were "concerned" for her health and recommended that she remain under medical supervision
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X