యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. నెల రోజులకుపైగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం కారణంగా ఇరాన్ తన బ్రహ్మాస్త్రమైన హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో ఉన్నాయి. అయితే హార్మూజ్ జలసంధిని తెరవాలని.. సంధి చర్చలకు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పటికే ఇరాన్ కు అనేకసార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇరాన్ మాత్రం ట్రంప్ మాటలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. దాడులను కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేస్తోంది.

ఈ క్రమంలో అమెరికాలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ కేబినెట్ నుంచి ఇప్పటికే హోమ్ లాండ్ సెక్రటరీ క్రిస్టీ నోయమ్, అటార్నీ జనరల్ పామ్ బాండీలను పదవుల నుంచి తొలగించగా తాజాగా మరో సంచలనం జరిగింది. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ ను బలవంతంగా పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్ సేత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్మీ చీఫ్ ముందస్తు రాజీనామా చేయాలని హెగ్ సేత్ సూచనలు చేయడంతో ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ అమెరికా రక్షణ విభాగం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెగ్ సేత్ నిర్ణయంతో పెంటగాన్ ఒక్కసారిగా షేక్ అయింది.

RandyGeorge U S Army Chief Dismissed as US Army Chief During Iran Conflict Tensions Randy George

రాండీ జార్జ్ స్థానంలో యాక్టింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ గా క్రిస్టోఫర్ లానీవ్ ను నియమించింది అమెరికా. పశ్చిమాసియాలో యుద్ధం దృష్ట్యా ఈ నిర్ణయం కీలక పరిణామంగా మారింది. " జనరల్ రాండీ ఏ. జార్జీ తక్షణమే 41 వ ఆర్మీ చీఫ్ జనరల్ గా పదవీ విరమణ పొందారు. జనరల్ జార్జి దశాబ్దాల సేవను అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్ పెంటగాన్ ప్రశంసిస్తోంది. ఆయన రిటైర్ మెంట్ ను మేము స్వీకరిస్తున్నాము" అని పెంటగాన్ అధికార ప్రతినిధి సియాన్ పార్నెల్ ప్రకటన చేశారు.

అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్ సేత్.. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ ను పదవి నుంచి తిప్పుకోమన్నారని అమెరికా డిఫెన్స్ వర్గాలు ధృవీకరించాయి. ఆయన స్థానంలో ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్న క్రిస్టోఫర్ లానీవ్ తాత్కాలిక అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తారు. అమెరికా సెనేట్ నుంచి తదుపరి ఆర్మీ చీఫ్ కు ఆమోదం లభించేంత వరకూ ఆయన పదవిలో ఉంటారు. ఇక రాండీ జార్జ్ 2023 సెప్టెంబర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో ఉండాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆయన్ను ఏడాదిన్నరకే పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా ఈ షాకింగ్ డెసిషన్ తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+