వారి కోసం ఆ నాయకురాలు పోరాడితే, రేప్ చేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెర్లిన్: వలస బాధితుల తరఫున పోరాటం చేస్తున్న జర్మనీ యువ రాజకీయ నాయకురాలు సెలిన్ గోరెన్ గత జనవరిలో వలసదారుల చేతిలోనే అత్యాచారానికి గురైంది. అర్ధరాత్రి సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు, రేప్ చేశారు.

అయితే, వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె.. తన పైన జరిపిన వారి వివరాలను తప్పుగా వెల్లడించిందని తెలుస్తోంది. గత జనవరిలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆమె ఏ వలసదారుల కోసమైతే పోరాటం చేస్తున్నారో, వారి చేతిలోనే దారుణంగా అత్యాచారానికి గురి కావడం షాక్‌కు గురి చేసింది.

నిజానికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డవారు అరబిక్, పార్సీ భాషలను మాట్లాడినట్టు ఆమె అప్పుడే గుర్తించారు. కానీ, జర్మన్ మాట్లాడినట్లు పోలీసులకు తెలిపింది. ఆమె తప్పుడు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Raped German politician Selin admits lie over her attackers' nationality

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వలసదారులపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకే తాను అలా చెప్పినట్టు ఆమె తాజాగా తెలిపారు.

జాతి వివక్షతో కూడిన వ్యతిరేకతను దూరం చేయడానికే ఆ సమయంలో అలా అబద్ధం చెప్పానని ఆమె చెప్పింది. ఈ విషయం తెలిసిన అనంతరం వలస బాధితుల కోసం పోరాడుతున్న సెలిన్‌ను అత్యాచారం చేసిన వారికి జర్మనీ ఆశ్రయం కల్పించాల్సిన అవసరముందా? అనే వాదన పెరుగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Raped German politician Selin admits lie over her attackers' nationality.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి