మంకీపాక్స్-బయటపడ్డ మరో అరుదైన వైరస్-అసలేంటీ వ్యాధి,లక్షణాలేంటి,చికిత్స ఉందా...?

యూకెలో ఓవైపు కోవిడ్ 'డెల్టా' వేరియంట్ కేసులు విజృంభిస్తుండగా మరోవైపు 'మంకీ పాక్స్' కేసులు బయటపడుతున్నాయి. గతవారం నార్త్ వేల్స్‌ ప్రాంతంలో రెండు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాధి బారినపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... హెల్త్ కేర్ అధికారులు వారి కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న వేళ... అరుదైన మంకీ పాక్స్ కేసులు బయటపడుతుండటం కలవరపెడుతోంది.

అసలేంటీ మంకీ పాక్స్

అసలేంటీ మంకీ పాక్స్

మంకీ పాక్స్ అనేది జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్. పోక్స్‌విరిడే సమూహాంలో అర్థోపోక్స్‌వైరస్ అనే జాతికి చెందిన వైరస్ ఇది. మశూచి వ్యాధి తరహా లక్షణాలకు మంకీ పాక్స్‌ దగ్గరగా ఉంటుంది. అయితే క్లినికల్ మంకీ పాక్స్ అంత తీవ్రమైన వ్యాధి ఏమి కాదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం... ఇదొక అరుదైన వ్యాధి. ప్రధానంగా సెంట్రల్ ఆఫ్రికా,పశ్చిమాఫ్రికాలోని ఉష్ణమండల వర్షారణ్యంలో ఈ వ్యాధి ప్రబలుతుంటుంది. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది.

మొదట 1970లో బయటపడ్డ వైరస్...

మొదట 1970లో బయటపడ్డ వైరస్...

ఇప్పటివరకూ 11 ఆఫ్రికన్ దేశాల్లో మనుషులకు మంకీ పాక్స్‌ సోకిన కేసులు బయటపడ్డాయి. 1970లో కాంగోలో మొదటి మంకీ పాక్స్ బయటపడింది. 39 ఏళ్ల తర్వాత 2017లో నైజీరియాలో ఈ వైరస్ బయటపడింది. అప్పట్లో నైజీరియాలో మంకీ పాక్స్ గట్టిగానే విజృంభించింది. అమెరికాలోనూ 2003,వానా కాలంలో మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి 2018 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌‌కు,డిసెంబర్ 2019లో యూకె దేశాలకు,మే 2019లో సింగపూర్ దేశాలకు మంకీ పాక్స్ వ్యాప్తి చెందింది.

ఎలా వ్యాపిస్తుంది...

ఎలా వ్యాపిస్తుంది...

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం... రక్తం,శరీర స్రావాలు,జంతువుల శ్లేష్మ గాయాల ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుంది.ఎలుకలు ఈ వ్యాధికి సహజ వాహకాలు అని నిపుణుల అభిప్రాయం. అలాగే సరిగా వండని మాంసం,వైరస్ సోకిన జంతువుల ఉత్పత్తులను తినడం ద్వారా మంకీ పాక్స్ సోకే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందినది తక్కువే. వ్యాధి సోకినవారిలో జ్వరం,తీవ్ర తలనొప్పి,వెన్ను నొప్పి,కండరాల నొప్పి,నీరసం తదితర లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. వ్యాధి సోకిన మూడు రోజులకు శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా అరచేతులు,ముఖం,పాదాలపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

చికిత్స ఉందా...?

చికిత్స ఉందా...?

ఇప్పటికైతే మంకీ పాక్స్‌కి ప్రత్యేక చికిత్స విధానమంటూ ఏదీ లేదు. ప్రత్యేక వ్యాక్సిన్ కూడా లేదు. మశూచి వ్యాధి చికిత్సలో ఉపయోగించే వ్యాక్సిన్నే దీనికీ ఉపయోగిస్తున్నారు. మంకీ పాక్స్‌ వ్యాధికి అది 85 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. జంతువులను అసురక్షితంగా తాకడం,ముఖ్యంగా రోగాల బారినపడిన జంతువులను తాకడం ద్వారా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. మంకీ పాక్స్ సోకిన పేషెంట్ల పట్ల భౌతిక దూరం పాటించడం ద్వారా వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+