పాక్‌తో చర్చలకు మేం సిద్ధమే: షరీఫ్‌కు మోడీ చురకలు

న్యూయార్క్: పాకిస్తాన్‌తో ప్రశాంత వాతావరణంలో తాము ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉగ్రవాద ఛాయలు ఉండకూడదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత దేశం శాంతి, సౌహార్ద్ర సంబంధాలనే కోరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు సమస్యలపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైపోవని ఆయన హెచ్చరించారు.

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం కావలసింది శాంతి అని ఆయన అన్నారు. జమ్మూ-కాశ్మీర్‌లో ప్లెబిసైట్‌ నిర్వహించాలన్న నవాజ్‌ ప్రసంగాన్ని మోడీ ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా శాంతియుత వాతావారణాన్ని పాకిస్తానే సృష్టించి చర్చలకు ముందుకు రావాలని మోడీ హితవు చెప్పారు.

Narendra Modi

నవాజ్ షరీఫ్ ప్రసంగానికి ఎలా ప్రతిస్పందిస్తారని ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిశీలకులు ఎదురుచూస్తున్న సమయంలో ఇది శాంతి స్థాపన సమయమని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఆయన ప్రసంగం హిందీలో సాగింది. ఉగ్రవాద ఛాయల క్రింద, బెదరింపులు, హెచ్చరికల మధ్య గాక, సద్బుద్ధితో, సుహృద్భావంతో మైత్రీ వాంఛతో పాకిస్తాన్‌ చొరవతో చర్చలకు ముందుకు రావాలని, ఇందుకు ఇండియా ఎపడూ ముందువరుసలో ఉంటుందని ఆయన చెప్పారు.

అందరం ఆకలి, పేదరికం లేని ప్రపంచం కోసం కృషి చేద్దామని అంటూ ఐక్యరాజ్య సమితి వంటి గొప్ప సంస్థలలో ముఠాలు కట్టవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులలో అందరం కలసికట్టుగా పనిచేయాలని ఆయన హితవు పలికారు. ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాన్ని ఉద్దేశించి తమ మొట్టమొదటి ప్రసంగంలో మోడీ ప్రసంగిస్తూ భారత దేశం వేదకాలం నుంచి వసుధైక కుటుంబమనే ధార్మిక సిద్ధాంతంతోనే మనుగ డ సాగిస్తోందని చెప్పారు.

మోడీ ప్రసంగం 32 నిమిషాల పాటు సాగింది. ఆయన ప్రసంగాన్ని 200 మంది ప్రపంచ నేతలు ఆలకించారు. మోడీ తన ప్రసంగంలో యోగా, పారిశుద్ధ్యం, విద్యుత్తు కొరత, మంచినీ టి వంటి పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రసంగం ముగిసిన తర్వాత మోడీని అభినందించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వరుస కట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+