రెడ్ కార్పెట్: మోడీ పనితీరుపై అమెరికా ప్రశంసలు

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుపై అమెరికా ప్రశంసల వర్షం కురిపించింది. పదవిని చేపట్టిన తొలి 15 నెలల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గణనీయమైన ప్రగతిని సాధించగలిగారంటూ ప్రశంసించింది. మోడీ ఈ కొద్ది వ్యవధిలోనే విదేశీ సంస్థలకు ఎర్రతివాచీ పరిచారు, కానీ, భారతలో అధికారపరమైన అకారణ జాప్యం పెట్టుబడులకు పెను అవరోధాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది.

ఎర్రతివాచీ స్వాగతం... అధికారపరంగా అనుచిత జాప్యం (రెడ్‌ టేపిజం) అనేవి రెండూ సమాంతర రేఖల్లా ప్రయాణిస్తున్నాయా అన్న ప్రశ్నకు అమెరికా అధికార ప్రతినిధి ఒకరు ఔననే జవాబిచ్చారు.

అయినా, అనేకానేక అంశాల్లో భారత్‌లోని ఏ ప్రభుత్వం ఇంత తక్కువ వ్యవధిలో ఇలాంటి గణనీయ ప్రగతిని సాధించడం తాను చూడలేదని దక్షిణాసియా వ్యవహారాల విభాగం సీనియర్‌ సంచాలకులు, అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక సహాయకుడు అయిన పీటర్‌ ఆర్‌ లెవాయ్‌ పేర్కొన్నారు.

Red tapism of Indian bureaucracy poses hurdle to red carpet: US

‘ప్రపంచ వ్యాప్తంగా భారత అధికార యంత్రాంగానికి ఓ గుర్తింపు ఉంది. తనదైన ప్రమాణాలు దాని సొంతం. మొత్తం మీద చూస్తే.. ప్రధాని మోడీ దార్శినికత, సామర్థ్యాల మేరకు లక్ష్యాలను అందుకునే దిశగా మరింత వేగంగా అడుగులుపడేందుకు తనకున్న అవకాశాలను ఆ ప్రభుత్వం గుర్తించింది' అని లెవాయ్‌ విశ్లేషించారు.

మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత భారత-అమెరికా సంబంధాలు అత్యద్భుత స్థితిలో ఉన్నాయన్నారు. ముందెన్నడు లేనంతగా ప్రగాఢ సంబంధాలు నెలకొన్నాయని చెప్పారు. ఇటు అమెరికా వైపున అధ్యక్షుడు ఒబామా తదితరులు, అటు భారత ప్రధాని, ఆయన కేబినెట్‌ మున్ముందు మరింత సుదృఢమైన ద్వైపాక్షిక సహకారాన్నే ఆశిస్తున్నారని తెలిపారు.

ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో కలిసిమెలిసి ముందడుగేసే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయని లెవాయ్‌ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో తెమలకుండా ఉన్న ద్వైపాక్షిక అంశాలు, సరిహద్దు సమస్యల విషయంలో మోడీ ప్రభుత్వం అనూహ్య ప్రగతినే సాధించిందని ఆయన ప్రశంసించారు.

సరిహద్దు విషయంలో బంగ్లాదేశ్‌తో ఇటీవలి తీర్మానాన్ని లెవాయ్‌ ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇదో అనూహ్య, సానుకూల పరిణామమంటూ ఆయన కొనియాడారు. అయితే, పాకిస్థాన్‌తో ఇంకా ఉద్రిక్తపరిస్థితి కొనసాగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే మొత్తం మీద చాలా సానుకూల స్థితి గోచరిస్తోందన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగాలని అధ్యక్షుడు ఒబామా కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఒబామా భారత్‌ పర్యటన సందర్భంగా ప్రకటించిన 70 అంశాల్లో చెప్పుకోదగిన ప్రగతినే సాధించినప్పటికీ.. మరింత కృషి జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ భారత-అమెరికా సంబంధాలు మరింత చిక్కబడటానికి కారణమైనాయని చెప్పారు.

కాగా, సెప్టెంబరులో మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఒబామాతో సమావేశమయ్యే అవకాశాలపై లెవాయ్‌ ఎటూ తేల్చి చెప్పలేదు. న్యూయార్క్‌, కాలిఫోర్నియాలకు మోడీ రాకకోసం అమెరికా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోందని మాత్రం పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+