పాక్‌లో దారుణం: ఖవ్వాలి సింగర్ కాల్చివేత
కరాచీ: గుర్తు తెలియని సాయుధులు పాకిస్తాన్‌లో ప్రముఖ కవ్వాలి గాయకుడు అంజాద్ సబ్రీని కాల్చి చంపారు. బుధవారంనాడు ఈ సంఘటన జరిగింది. ఈ విషాదకరమైన సంఘటన కరాచీలోని లియాఖతాబాద్ ప్రాంతంలో జరిగింది.
సబ్రీ (45) తన అనుచరుడితో పాటు కారులో ప్రయాణిస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. దాంతో సబ్రీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ఇద్దరిని కూడా హుటాహుటిన అబ్బాసీ షహీద్ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందతూ సబ్రీ మరణించారు. లియాఖతాబాద్ ప్రాంతంలో దుండుగులు సబ్రీ కారును లక్ష్యం చేసుకుని జరిపిన కాల్పుల్లో సబ్రీతో పాటు ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
సబ్రీ ఛాతీలోకి, తలలోకి బుల్లెట్లు దూసుకుని వెళ్లాయని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడని, ఆయనతో పాటు డ్రైవర్, అనుచరుడు కూడా మరణించారని చెప్పారు. సబ్రీపైకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. సబ్రీ సోదరులు పాడిన వెంటనే హిట్ అవుతూ వచ్చాయి.












Click it and Unblock the Notifications