వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏలియన్లతో మాటలు: రేడియో డిష్ ఏర్పాటు, వినాశనమేనా?

ఏలియన్లతో సంభాషించేందుకుగాను అతి పెద్ద రేడియో డిష్ ప్రాజెక్టును చైనా ఏర్పాటు చేసి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే దీని ద్వారా అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందుండాలని చైనా ప్రయత్నాలు చే

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఏలియన్లతో సంభాషించేందుకుగాను అతి పెద్ద రేడియో డిష్ ప్రాజెక్టును చైనా ఏర్పాటు చేసి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే దీని ద్వారా అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందుండాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రపంచంలో అన్ని దేశాల కంటే తానే అన్ని రంగాల్లో ముందున్నట్టుగా చూపించాలనే చైనా ప్రయత్నం ప్రపంచానికి ఇబ్బందులను కల్గించే అవకాశాలను కల్పిస్తోంది.

Revealed China to make first contact with ALIEN Life using world's largest dish

2016లో టియాంగ్‌గాంగ్‌-2 ను ప్రయోగించి అమెరికా, రష్యాలను వెనక్కినెట్టి అతిపెద్ద స్పేస్‌ ఎక్స్‌ ప్లోరర్‌ పవర్‌హౌజ్‌గా నిలిచింది చైనా .ఇప్పుడు అతిపెద్ద రేడియో డిష్ ద్వారా మరో ఘనత సాధించాలని యత్నిస్తోంది.

వందల కోట్ల ఖర్చుతో 500 మీటర్ల గోళాకార రేడియో డిష్‌ను నెలకొల్పగా.. ప్యూర్టో రికోలో ఉన్న దానికంటే ఇది రెండింతలు పెద్దదని తేలింది. ఈ రేడియో డిష్ ఖగోళంలోని సూదూర ప్రాంతాలకు సిగ్నల్స్‌ను పంపగలదని తెలుస్తోంది. తద్వారా సుదూర పాలపుంతల్లోని ఏలియన్స్‌ ఉనికిని తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చైనా భావిస్తోంది.

గత వారం ఫ్లైయింగ్ సాసర్‌ చైనా గోడ వద్ద కనిపించిందన్న పుకార్ల నేపథ్యంలో అధికారులు మరింత దూకుడు ప్రదర్శించి ఈ రేడియో డిష్‌లోని కొన్ని విభాగాలను యాక్టివ్‌ చేశారు . చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ కూడా ఈ విషయంలో కొంత ఆసక్తిని చూపుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ ఎలియన్స్ తో మానవాళికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు . అవి మనిషికంటే తెలివైనవని, వాటితో ప్రపంచానికి ముప్పు ఏర్పడవచ్చని ప్రకటించారు. మరోవైపు చైనాకే చెందిన రచయిత, గ్రహాంతరవాసులపై సుదీర్ఘ అధ్యయనాలు చేసిన పరిశోధకారుడు లియూ సిక్సిన్‌ ఒక్కసారి ఎలియన్లు-మానవాళి ఎదురుపడితే.. ఇక సృష్టి వినాశనమే అని అభిప్రాయపడ్డారు.

కానీ, చైనా మాత్రం తమది ఓ సాహసామంటూ గొప్పగా చెప్పుకుంటోంది. గత వారం మనిషికి తోడుగా మరోజీవి ఉందన్న విషయం నిర్ధారణ అవుతుందని వారు పేర్కొంటున్నారు.

English summary
Last year China cemented itself as a space exploration powerhouse by firing its space laboratory Tiangong 2 into low Earth orbit, becoming only the third nation, after the US and Russia, to independently get people into space.The nation has also has had dozens of suspected-paranormal encounters including claims of a UFO sighting over the Great Wall of China last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X