వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి ముందంజలో రిషి సునాక్ - ప్రథమ శత్రువంటూ : ప్రధాని పదవి దిశగా..!!

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరోసారి ముందంజలో నిలిచారు. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేత పదవి కోసం నిర్వహించిన రెండో దశ ఎన్నికలో అత్యధికంగా 101 మంది ఎంపీలు సునాక్‌కు మద్దతు తెలిపారు. క్రమక్రమంగా పట్టు బిగిస్తున్నారు. దాంతో పాటు తదుపరి రౌండ్​కు అర్హత సాధించారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి రుషి తరువాతి స్థానాల్లో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (83 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (64 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బదెనోచ్ (49 ఓట్లు), టోరీ బ్యాక్‌బెంచర్ టామ్ తుగెన్‌ధాట్ (32 ఓట్లు) వరుసగా నిలిచారు.

ప్రధారి రేసులో అయిదుగురు పోటీ

ప్రధారి రేసులో అయిదుగురు పోటీ


వీరంతా వచ్చే వారం జరగబోయే తదుపరి రౌండ్​లో పోటీ పడనున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి ఆటార్నీ జనరల్‌ సుయెలా బ్రావెర్మన్‌.. రెండో రౌండ్​లో 27 ఓట్లు రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. మొదటి రౌండ్​లోనూ సునాక్.. 88 ఓట్లతో తొలి స్థానంలో నిలిచారు. ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తున్న ద్రవ్యోల్బణమే తన ప్రథమ శత్రువని రుషి పేర్కొన్నారు. రెండో రౌండ్ లోనూ దూసుకెళ్తున్న రుషి తన లక్ష్యాలను ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. ప్రజలపై పన్ను భారాన్ని తగ్గిస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇవన్నీ చెప్పటం లేదన్నారు.

బ్రిటన్ కు సేవ చేయటం కోసమే

బ్రిటన్ కు సేవ చేయటం కోసమే

ప్రజలను పేదరికంలో నెట్టేస్తున్న ద్రవ్యోల్బణమే తన శత్రువని తేల్చి చెప్పారు. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీని ఓడించగల సమర్థుడైన టోరీ నేతను తానేనని ధీమా వ్యక్తంచేశారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలో తాను చేరడానికి కొన్ని నెలల ముందు వరకూ అమెరికా గ్రీన్‌ కార్డును కలిగి ఉన్నానని, రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆ దేశంలోనే స్థిరపడతానని తనపై వస్తున్న విమర్శలను రిషి తోసిపుచ్చారు. అమెరికాలో చదువుకున్న తాను..అక్కడే ఉద్యోగం చేశానని గుర్తు చేసారు. అయితే, బ్రిటన్ కు సేవ చేయటం కోసమే తిరిగి వచ్చానన్నారు.

అదృష్టం వరిస్తే బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా

అదృష్టం వరిస్తే బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా


అదృష్టం వరిస్తే బ్రిటన్‌ ప్రధాన మంత్రిని అవుతానని చెప్పారు. సవాళ్లతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని సమర్థంగా నడిపించగలనని.. నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఆ విధులను నిర్వర్తిస్తా. అందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు, అనుభవం తనకు ఉన్నాయని వివరించారు. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుడిగా శ్రమను, జీవితంలో ఎదగాలన్న కలలను నమ్ముకున్న వ్యక్తిగా తన గురించి వివరించారు. ఇతర దేశాల వారిని సాదరంగా స్వాగతించే సగర్వమైన చరిత్ర బ్రిటన్‌ సొంతమన్నారు. ఈ నెల 21న ప్రధాని పదవి కోసం నిలిచే తుది పోరులో ఇద్దరి పేర్లు ఖరారు కానున్నాయి. సెప్టెంబర్ 5న ఎన్నికలు జరుగుతాయి.

English summary
Rishi Sunak won the second round of ballot in the Conservative leadership race with 101 votes, tightening his grip on the race to replace Boris Johnson.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X