షాకింగ్.. 16 ఏళ్ల అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడిన రోబో.. ఏమైందంటే..?

సూపర్ స్టార్ రజనీకాంత్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన రోబో సినిమా గుర్తుందా..? ఆ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తో రోబో లవ్ లో పడుతుంది. నాకు సనా కావాలంటూ రజనీకాంత్ తో పెద్ద యుద్ధమే చేస్తుంది. అదంతా సినిమానే అని అనిపించినా తాజాగా జర్మనీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇనుములో హృదయం మొలిచెలే అన్నట్లు.. ఓ యువతిపై రోబో అసభ్యంగా ప్రవర్తించింది. దాంతో అక్కడి అధికారులు ఆ రోబోను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జర్మనీలోని కోలోగ్నె ప్రాంతంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ 16 ఏళ్ల అమ్మాయి నిలబడింది. అదే సమయంలో 1.2 మీటర్ల ఎత్తు.. ఎరుపు, బంగారు వర్ణంతో ఉన్న ఓ రోబో అక్కడకు వచ్చింది. అలా వెనకాల నుంచి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అయితే ఆ రోబో.. యువతితో అసభ్యంగా ప్రవర్తించడం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పబ్లిష్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ రోబోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే ఈ రోబోను ఇద్దరు టీనేజీ బాయ్స్ కొద్ది దూరంలో ఉండి ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ యువకుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించారు.

ఈ ఘటనపై కోలోగ్నె పోలీస్ అధికారి మాట్లాడుతూ.." ఈ రోబో అమ్మాయి వెనక నుంచి వచ్చి ఆమె బ్యాక్ పార్ట్ ను టచ్ చేసింది. అంతేకాక ఆ ప్రాంతాన్ని నిమురుతూ కనిపించింది. దాంతో యువతి తీవ్ర అసౌకర్యానికి గురైంది" అని తెలిపారు. అయితే ఈ రోబో ఓనర్ అయిన 16 ఏళ్ల యువకుడు.. అతనికి సహకరించిన 19 ఏళ్ల మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరం నుంచి ఆ యువకులు రోబోను ఆపరేట్ చేసినట్లు గుర్తించారు.

Robot behaves inappropriately with 16 year girl authorities seize robot Shocking incident Germany

అలాగే అమ్మాయితో రోబో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ చేసి కామెంట్ సెషన్ ను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ లైంగిక దాడి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇక ఈ ఘటన సమయంలో ఆ రోబోను ఎలా ఆపరేట్ చేశారు..? ఆ అమ్మాయిని వేధించే విధంగా రోబోను కావాలనే మేనిపులేట్ చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+