మరోసారి రష్యాపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి..!

న్యూ ఇయర్ వేళ రష్యాలో మరోసారి ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడుల్లో 24 మంది మరణించినట్లు సమాచారం. ఖేర్సన్‌ రీజియన్ నల్ల సముద్రం తీరంలో ఉన్న ఓ కేఫ్‌ పై మూడు డ్రోన్లతో బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది చనిపోగా మరో 50మందికిపైగా గాయపడినట్లు సమాచారం.

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ లోని ఖేర్సన్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల వేళ ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో 24 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. ఓవైపు దౌత్య చర్చలు జరుగుతున్నా.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది.

బ్లాక్ సీ తీరంలోని ఖోర్లీ రిసార్ట్ పట్టణంలోని ఒక కేఫ్, హోటల్‌ పై మూడు డ్రోన్‌ లు దాడి చేశాయని ఆ ప్రాంత నాయకుడు వ్లాదిమిర్ సాల్డో పేర్కొన్నారు. అయితే ఈ దాడులపై ఉక్రేనియన్ అధికారులు స్పందించలేదు.

మరోవైపు ఈ దాడిని రష్యా అధికారులు ఖండించారు. రష్యా పార్లమెంటు ఎగువ సభ చైర్‌పర్సన్ వాలెంటినా మాట్వియెంకో ఈ దాడిని ప్రస్తావిస్తూ.. "రష్యా లక్ష్యాలను త్వరగా సాధించాలనే సంకల్పానికి ఈ దాడి బలం చేకూర్చింది" అన్నారు. ఇది "మా డిమాండ్లను మరోసారి రుజువు చేస్తుంది" అని ఆమె పేర్కొన్నారు.

Russia Accuses Ukraine of Deadly New Year Drone Strike 24 Killed in Occupied Kherson

ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దీర్ఘ-శ్రేణి డ్రోన్ దాడి చేసిందని మాస్కో ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా బయటకు వదిలింది. అయితే ఉక్రెయిన్ ఈ ఆరోపణలను ఖండించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దెబ్బతిన్న డ్రోన్ వీడియోను ఉక్రెయిన్ తోసిపుచ్చింది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఉద్రిక్తతలను మరింత పెంచుతుండటం ఆందోళనకరంగా ఉంది. ఇక నోవ్ గొరోడ్ ప్రాంతంలోని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనంపై ఉక్రెయిన్ దాడికి పాల్పడినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. పుతిన్ అధికారిక నివాసం పైకి 91 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడిందని అన్నారు. రష్యన్ స్టేట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+