సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పేలుడు: 10మందికి గాయాలు

Subscribe to Oneindia Telugu

మాస్కో: రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నగరం బాంబు దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం (డిసెంబర్ 27) సాయంత్రం నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌లో పేలుడు సంభవించింది.

ఈ పేలుడు ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Russia: Blast in St Petersburg supermarket, 10 injured

కాగా, పేలుడుకు ఎవరు పాల్పడ్డారనే విషయం తేలాల్సి ఉంది. స్టోరేజీ ఏరియాలోని ఓ బ్యాగులో 7ఔన్సుల పేలుడు పదార్థాన్ని దుండగులు పెట్టి వెళ్లిపోయినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఘటనపై ఉగ్రవాదుల హస్తం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 10 people were reported injured after a blast in a supermarket in St Petersburg, Russia.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి