వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ భారీ మెజారిటీ విజయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విజయం సాధించారు. మరో ఆరేళ్ళ పాటు పుతిన్ ఈ పదవిలో కొనసాగనున్నారు.వరుసగా నాలుగోసారి పుతిన్ ఈ పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పుతిన్ రష్యాకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌కు భారీ మెజారిటీ లభించింది.

రష్యా అద్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సుమారు 75 శాతం ఓట్లు వ్లాదిమిర్ పుతిన్‌కు దక్కాయి. ప్రత్యర్ధికి కేవలం 11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

Russia election: Vladimir Putin wins by big margin

2000 నుండి 2008 వరకు రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ ఆ తర్వాత నాలుగేళ్ళ పాటు ప్రధానిగా కొనసాగారు. 2012లో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యాలో పుతిన్ ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న అలెక్సీ నావల్సీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు.

భారత కాలమానం ప్రకారంగా శనివారం నాడు రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. 2012తో పోలిస్తే పుతిన్‌కు వచ్చిన ఓట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పుతిన్‌ సమీప ప్రత్యర్ధి కమ్యూనిష్టు పార్టీ అభ్యర్ధిగా ఉన్న పావెల్ గృడీనిన్ సుమారు 11 శాతం ఓట్లను సాధించాడు.

English summary
Vladimir Putin will lead Russia for another six years, after securing an expected victory in Sunday's presidential election.With almost all the ballots counted, he had received more than 76% of the vote, the central election commission said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X