వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని యుద్దం: తూర్పు ఉక్రెయిన్‌కు వేలాది మంది రష్యా సైనికులు: అమెరికా

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవల జరిగిన చర్చలు తాత్కాలికంగా ఫలించిన.. మొత్తం రష్యా సేనలు మాత్రం ఉక్రెయిన్ విడిచి వెళ్లలేదు. ఈ క్రమంలో అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా వేలాది మంది సైనికులను మోహరించిందని అమెరికా ఆరోపించింది. తూర్పుతోపాటు దక్షిణ భాగంపై కూడా ఫోకస్ చేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేమ్ సుల్లీవన్ పేర్కొన్నారు.

రష్యా యుద్ద లక్ష్యాలను క్రమంగా తగ్గించుకుంటుందని విశ్వాసిస్తున్నామని తెలిపారు. అందుకోసమే దక్షిణ, తూర్పు భాగం దిశగా సైనికులను మొహరిస్తోందని వివరించారు. ఈ మేరకు ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రష్యా ఎలాంటి విజయం సాధించలేదని.. కానీ దానిని ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలని అన్నారు.

Russia Planning To Send Thousands Of Soldiers To Eastern Ukraine: US

గత ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రష్యా సేనలు ఉక్రెయిన్‌పై దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని చెప్పి.. ఉక్రెయిన్ దేశాన్ని విధ్వంసం చేసింది. త్వరలో ఉక్రెయిన్ కోసం మిలిటరీ సాయం కోసం అమెరికా అధినేత బైడెన్ ప్రకటన చేశారు. రష్యా ఇందన ఉత్పాదకతపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని కూడా చెప్పారు. ఇదే అంశాన్ని యూరప్ దేశాల సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

ఉక్రెయిన్ కన్నా రష్యా ఎక్కువ ఆయుధ సంపత్తిని కలిగి ఉందని సుల్లివన్ తెలిపారు. తదుపరి లక్ష్యంగా సుధీర్ఘంగా ఉండొచ్చని వివరించారు. ఖెర్సన్ నగరాన్ని ముట్టడించాలని రష్యా అనుకుంటుందని.. క్రెమ్లిన్‌లో గల ఇతర ప్రాంతాల్లో వైమానిక, క్షిపణి దాడులు ప్రారంభించాలని అనుకుంటుందని వివరించారు.

English summary
Russia plans to deploy tens of thousands of soldiers in eastern Ukraine as it shifts its focus to the country's south and east, U.S. President Joe Biden's national security adviser Jake Sullivan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X