వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్ ఆస్తులపై వేట : రూ.15 లక్షల కోట్లపైనే..? అమెరికా.. మిత్రదేశాల కన్ను..!!

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై దాడులతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాలను టెన్షన్ పట్టిస్తున్నారు . ఆంక్షలు విధించినా తగ్గేదిలే అంటూ విరుచుపడుతున్నారు. దీంతో పుతిన్ ఆస్తులను సీజ్ చేసేందుకు అమెరికాతోపాటు .. పశ్చిమ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సీజ్ చేస్తున్నట్లు కొన్ని ఐరోపా దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆస్తులపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. పుతిన్ రష్యా అధ్యక్షుడుగానే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపద ఉన్న వ్యక్తుల్లో ఒకడుగా పేర్కొంటున్నాయి. తాజాగా పుతిన్ ఆస్తులపై అంతర్జాతీయ మీడియా సంచలన విషయాలను ప్ర‌చురించాయి.

బినామీల పేరుతో రూ.15 ల‌క్ష‌ల కోట్లు

బినామీల పేరుతో రూ.15 ల‌క్ష‌ల కోట్లు

వ్లాదిమిన్ ఆస్తులు అధికారికంగానే తక్కువే. కానీ ఆయన తన ఆస్తుల్ని బినామీల పేరుతో భద్రపరుచుకున్నారట. మొత్తం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సహచరుల పేరిట దాచినట్లు మెయిల్ఆన్‌లైన్ తన సంచలన కథనంలో పేర్కొంది. వాటి విలువ దాదాపు రూ. 15 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. వారి అకౌంట్లతో బిలియన్ల డాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మిత్రుల కుటుంబ సభ్యుల మీద కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది. పుతిన్ మేనల్లుడు, మిత్రుడి కొడుకు పేర కూడా 500 మిలియన్ డాలర్ల సంపద ఉంది . రష్యాలో అత్యంత సంపద కలిగిన వారి లిస్టులో వారి పేర్లు కూడా ఉన్నాయి.

2ల‌గ్జరీ కొర్లు, విమానాలు

2ల‌గ్జరీ కొర్లు, విమానాలు


పుతిన్ బినామీల పేరిట విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు 700, విమానాలు 58 ఉన్నాయట. అంతే కాదు రష్యాలో అతిపెద్ద చమురు, సహజవాయువు కంపెనీలను వాడుకుని.. తన బినామీ సంస్థల ద్వారా పెద్దఎత్తున ఆస్తులు పోగేసుకున్నట్లు రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవాల్ని ఆరోపించారు. పుతిన్ అక్రమాస్తులను ప్రశ్నించినందుకే తనను జైలు పాలు చేశారని పేర్కొన్నారు. పన్ను ఎగవేత, రష్యా చట్టా నుంచి తప్పించుకునేందుకు ఈ భారీ బినామీ వ్యవహరానికి తెర తీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పుతిన్ ఆస్తుల‌పై నిఘా

పుతిన్ ఆస్తుల‌పై నిఘా


పుతిన్ మాజీ భార్య పేరు మీద ఫ్రాన్స్ లోనూ అత్యంత విలాసవంతమై భవనం ఉందట. అటు ఇంగ్లండ్‌లోనూ పుతిన్ కుమార్తెల పేరు మీద భారీగానే ఆస్తులు ఉన్నట్లు ఎన్సీఏ భావిస్తోంది. పుతిన్ ఆస్తులపై అమెరికా, ఐరోపా దేశాలు నిఘా పెట్టాయి..ఇప్పటికే పుతిన్ ఆస్తుల సీజ్ చేస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. అయితే పుతిన్ ఆస్తుల్ని సీజ్ చేసేందుకు పశ్చిమ దేశాలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. పుతిన్ బినామీల ఆస్తులను కలిపెట్టడం పెద్ద సమస్యగా మారింది. ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నాయి.

English summary
US Alliance Eyed russian president putin assets
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X