వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌తో చర్చలకు రష్యా సిద్ధం..! షరతు వర్తింపు !? : దిగివచ్చిన పుతిన్ ..

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబులు, మిస్సెల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. దీంతో భయానక పరిస్థితులు నెలకొన్నారు. ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాలు శాంతిని కోరుతున్నాయి. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా యుద్ధాన్ని ఆపాలని.. చర్చలు జరపాలని రష్యాను కోరారు. ఈనేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కాస్త దిగివచ్చినట్లు తెలుస్తోంది.

 ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం !

ఉక్రెయిన్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం !

తాజాగా రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుంచి కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ అధికారుల బృందంతో తాము చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చల కోసం బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌కు తమ రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య చర్చల ప్రస్తావన రావడంతో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే అన్న భావనను ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. .

 ఆయుధాలు వీడితే చర్చలు

ఆయుధాలు వీడితే చర్చలు

అయితే ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు వీడితేనే చర్చలకు తాము సిద్ధమేనని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గే లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ను నియో - నాజీల తరహాలో పాలించడం మాస్కోకు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని వారు సూచించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పారు. యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌ని కోరారు.

 స‌యోధ్య దిశ‌గా ర‌ష్యా-ఉక్రెయిన్‌

స‌యోధ్య దిశ‌గా ర‌ష్యా-ఉక్రెయిన్‌

ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి సానుకూలన ప్రకటన వెలువడింది. అటు యుద్ధాన్ని ఆపాలని.. చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాను కోరారు. యుద్ధాన్ని వీడి రష్యా-ఉక్రెయిన్‌లు సయోధ్య దిశగా అడుగులు వేయడంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. అటు త‌మ దేశ పౌరుల‌ను ఉక్రెయిన్ నుంచి స్వ‌దేశాల‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను సిద్ధం చేశాయి..

English summary
Russia ready for talks with Ukraine if lay down arms
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X