వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: అంతరిక్షంలో ప్రభావం.. యూఎస్, యూకే జెండాల తొలగింపు.. చరిత్రలో తొలిసారిగా !!

|
Google Oneindia TeluguNews

రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మిస్సైల్స్, బాంబుల దాడుల‌తో ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకరం మారింది. ఖర్కిన్‌కు రష్యా బలగాలు హస్తగతం చేసుకున్నాయి. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. తాజాగా లిబరేషన్ ఆఫ్ బలాక్లియా పట్టణాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తాజాగా ప్రకటించింది. అటు ఉక్రెయిన్ బలగాలు కూడా రష్యా సేనలను దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య యుద్ధ ప్రభావం తొలిసారిగా అంతరిక్షంలో పడింది.

Recommended Video

Russia Ukraine Conflict : Russian Space Rocket Removed US, UK & Japan Flags | Oneindia Telugu

భూమిపై యుద్ధం.. అంతరిక్షంలో ప్ర‌భావం ..

ఉక్రెయిన్ పై దాడులను ఖండిస్తూ రష్యాపై అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఇది ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం క్రాష్‌కు దారితీసిందని రష్యా తెలిపింది. అంతరిక్ష కార్యక్రమంలో పాల్గొనే దేశాల జెండాలను వారు ప్రయోగించే రాకెట్ నుంచి తొలగించారు. భారత దేశం జెండా తప్ప. ఇలా జరగడం చరిత్రలో ఇది మొదటి సారి . భూమిపై జరుగుతున్న యుద్ధ ప్రభావం అంతరిక్షంలో కూడా పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 యూకే, యూకే, జ‌పాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా..

యూకే, యూకే, జ‌పాన్ జెండాలను తొల‌గించిన ర‌ష్యా..


రష్యాన్ అంతరిక్షసంస్థ రోస్కోస్మోస్ ( ROSCOSMOS ) చీఫ్ డిమిత్రి రోగోజిన్ బైకోనూర్ లాంచ్ ప్యాడ్‌లోని కార్మికులు శుక్రవారం ప్రయోగించాల్సిన ఉన్న వన్‌వెబ్ రాకెట్‌లో అమెరికా, యూకే, జపాన్ జెండాలను కప్పి ఉంచుతున్న వీడియోను పోస్ట్ చేశారు. అయితే భారతదేశ జెండాను మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన రోజోజిన్ మాట్లాడుతూ కొన్ని దేశాల జెండాలు లేకుంటే మా రెకెట్ మరింత అందంగా కనబడుతుంది. అందుకే కొన్ని దేశాల జెండాలను లేకుండా చేశారని పేర్కొన్నారు.
ఆ జెండాలు తెల్లటి వినైల్ ను అతికించడం జరిగిందని తెలిపారు.

చెక్కుచెద‌ర‌కుండా భార‌త‌దేశం జెండా

చెక్కుచెద‌ర‌కుండా భార‌త‌దేశం జెండా

వన్‌వెబ్ ప్రాజెక్ట్ కింద బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే వివిధ దేశాల నుండి 36 ఉపగ్రహాలను సోయుజ్ రాకెట్ తీసుకువెళుతోంది. ప్రాజెక్ట్ 648 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది . వాటిలో 428 ఇప్పటికే లాంచ్ అయ్యాయి. ఇవన్నీ కూడా సోయుజ్ ద్వారనే జరిగాయి. ఈ భారీ ప్రాజెక్టుకు భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్, యూకే ప్రభుత్వం యజమానులు.

య‌జ‌మానుల‌గా యూకే, ఎయిర్ టెల్

య‌జ‌మానుల‌గా యూకే, ఎయిర్ టెల్


ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా, యూకే , ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. కాగా రష్యా అంతరిక్ష సంస్థ ఈ ప్రయోగానికి ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. మార్చి 5న జరగాల్చిన లాంచ్ కోసం లాంచ్ ప్యాడ్ లో రాకెట్‌ను ఇన్ స్టాల్ చేస్తున్నామని నిన్న తెలిపింది. అయితే తన నిర్ణయాన్ని ప్రస్తుతం మార్చుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ప్రస్తుత పరిస్థితి రాకెట్ ప్రయాగానికి ఇబ్బందిగా ఉందని పేర్కొంది. రష్యాపై యూకే విధించిన ఆంక్షల కారణంగా ఉపగ్రాహాలను మోసుకెళ్లే రాకెట్‌ని ప్రయోగించడానికి రోస్కోస్మోస్ (ROSCOSMOS) నిరాకరించింది.

 మార్చి 5న రాకెట్ లాంచ్.. ర‌ష్యా ష‌ర‌తులు

మార్చి 5న రాకెట్ లాంచ్.. ర‌ష్యా ష‌ర‌తులు

వన్ ప్రాజెక్టులో యూకే తన వాటాను తప్పనిసరిగా విక్రయించాలని రాకెట్ ప్రయోగానికి ఏజెన్సీ షరతు పెట్టింది. ఈ ఉపగ్రహాలను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించబో వన్‌వెబ్ హామీ ఇస్తుంది. దీనికి గ్యారెంటీ ఇవ్వకపోతే సోయూజ్ 2.1బి రాకెట్ ను ల్యాంచ్ ప్యాడ్ నుంచి తొలిగిస్తామని వన్‌వెబ్‌ను హెచ్చరించింది. మార్చి 5న వన్‌వెబ్ అంతరిక్ష నౌకను ప్రయయోగించడానికి మరొక షరతు పెట్టింది. వన్‌వెబ్ యొక్క వాటాలను బ్రిటన్ ఉపసంహరించుకోవాలని ఏజెన్సీ షరతు విధించింది. ఉక్రెయిన్ -రష్యాల మధ్య యుద్ధం అంతరిక్షంపై ప్రభావం చూపడంతో ఇది ఇంకెంత దూరం వెళ్తోందనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Russian space rocket removed US, UK and Japan flags at Russian launch pad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X