ఉక్రెయిన్ నాయకత్వాన్ని కూలదోయండి: ఉక్రెయిన్ ఆర్మీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపు, ముందుకే
మాస్కో/కైవ్: ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమంటూనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక సూచనలు చేశారు. ఉక్రెయిన్ నాయకత్వాన్ని కూలదోయాలంటూ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు పుతిన్. అక్కడి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.
Recommended Video

ఉక్రెయిన్ నాయకత్వాన్ని కూలదోయాలంటూ ఆర్మీకి పుతిన్ పిలుపు
ఉక్రెయిన్ నాయకత్వాన్ని ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠాగా అభివర్ణించారు. అభినవ నాజీలుగా ఉక్రెయిన్ నాయకత్వాన్ని పోల్చారు పుతిన్. ఓ టీవీ ఛానల్ ద్వారా వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని మిలటరీ సిబ్బందికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయొద్దు. అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి అని ఉక్రెయిన్ మిలిటరీకి పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు
కాగా, రెండో రోజు కూడా ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకర దాడులను కొనసాగిస్తున్నాయి. పలు నగరాలు, సైనిక స్థావరాలపై రష్యా వైమానిక దాడులు చేసింది. మూడు వైపుల నుంచి దాడులు చేసేదుకు యుద్ధ ట్యాంకులను పంపింది. రాజధాని కీవ్, రెండో పెద్ద నగరమైన ఖార్కివ్ తదితర పట్టణాల్లోకి ప్రవేశించిన రష్యా సేనలు.. ఉక్రెయిన్ బలగాల మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. తొలి రోజు దాడుల్లో అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు ప్రకటించిన రష్యా.. రెండో రోజు ఉక్రెయిన్ భూతలంపై 118 మిలటరీ లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో వందలాది మంది సైనికులు, ప్రజలు మరణించినట్లు సమాచారం. ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో సుమారు వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది.

ఉక్రెయిన్‌తో చర్చలన్న కాసేపటికి మాట మార్చిన పుతిన్
కాగా, ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమేనంటూ రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ సానుకూలంగా స్పందించింది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమేనని ఉక్రెయిన్ తెలిపింది.కాసేపటికి క్రితం చర్చలకు సిద్ధమేనని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంతలోనే తన మనసు మార్చుకుని దాడులు చేయాలంటూ సైన్యానికి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఉక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. రష్యాపై ఐరోపా కఠిన ఆంక్షలు
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో రష్యా సభ్యత్వాన్ని రద్దు చేస్తన్నట్లు ప్రకటించింది. మరోవైపు, రష్యా అధ్యక్షుడు, విదేశాంగా మంత్రి ఆస్తులను స్తంభింపజేసేందుకు ఇప్పటికే ఈయూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికాతోపాటు జపాన్, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు ఖండిస్తున్నాయి. ఫ్రాన్స్ సహా యూరోపియన్ దేశాలు.. రష్యాపై కఠని చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ సూచించారు. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపుచేసేందుకు సెమీ కండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను ఆయా దేశాలు నిలిపివేస్తున్నాయి. జపాన్ కూడా ఆంక్షలను విధించి పలు కీలక ఉత్పత్తులను రష్యాకు ఎగుమతిని ఆపేసింది. నాటో కూటమి కూడా రష్యాపై ఆంక్షలకు సిద్ధమైంది.
రోమేనియాకు చేరుకున్న భారతీయుల మొదటి బ్యాచ్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న తరుణంలో భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ లోని భారతీయుల మొదటి బ్యాచ్ రోమేనియాకు చేరుకుంది. అక్కడ్నుంచి స్వదేశానికి విమానాల్లో భారతీయులను తీసుకురానున్నారు. ఇప్పటికే పలు భారత విమానాలు రోమేనియా, బుడాపెస్ట్ నగరాలకు చేరుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications