బెలారస్‌లో రష్యా - ఉక్రెయిన్ చర్చలు.. శాంతి కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూపులు !!

ఉక్రెయిన్‌పై రష్యా సైనికుల దాడుల తీవ్రత కాస్త తగ్గింది. ఇరుదేశాలు శాంతి చర్చలకు ఒప్పుకున్నాయి. చర్చలకు వేదికగా బెలారస్ సరిహద్దు ప్రాంతమైన గోమెల్ నగరాన్ని ఎంచుకున్నాయి . రష్యా-ఉక్రెయిన్ బృందాలు చర్చల ప్రక్రియను ప్రారంభించాయి. ఈ చర్చలపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. వెంటనే కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పట్టుబడుతుంది. అయితే రష్యా మాత్రం పలు ఒప్పందాలకు అంగీకారం తెలపాలని కోరింది

1ష‌ర‌తులు లేకుండా చ‌ర్చ‌లు

1ష‌ర‌తులు లేకుండా చ‌ర్చ‌లు

ఈ చర్చలకు ఎలాంటి షరతులు లేకుండానే రెండు దేశాలు అంగీకరించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా జరిపిన దాడులతో ఉక్రెయిన్‌లో 352 మంది మరణించారని పేర్కొన్నారు. వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తీవ్రత తగ్గిందని ఉక్రెయిన్ సాయుధ బలగాలు పేర్కొన్నాయి. వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని పేర్కొన్నారు.

నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన ర‌ష్యా బ‌ల‌గాలు

నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన ర‌ష్యా బ‌ల‌గాలు


ఈ యుద్ధపోరులో రష్యా కు తీవ్ర నష్ట వాటిల్లిందనీ ఉక్రెయిన్ పేర్కొంది. శత్రు బలగాలు నైతిక స్థైర్యాన్ని కోల్పోయాయని తెలిపింది. వాస్తవాలకు వారి ప్రచారార్భాటాలకు చాలా తేడా ఉందని పేర్కొంది. బాంబులతో దాడులకు తెగబడ్డ మాస్కో ఇప్పు ఉక్రెయిన్‌ను చూసి వణికిపోతుందని వ్యాఖ్యానించింది. రష్యా దాడి చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 4వేల మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారని పేర్కొంది. దాదాపు 200 మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నామని తెలిపింది.

 ర‌ష్యాపై ఆంక్ష‌లు

ర‌ష్యాపై ఆంక్ష‌లు


ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది. మున్ముందూ మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చిరించింది. అటు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై నిషేధం విధిస్తున్నటు పలు దేశాలు ప్రకటించాయి. తాజాగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను దూరం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. తమ భాగస్వామ్య పక్షాలతో పాటు జీ 7 దేశాలతో కలసి రష్యాపై మున్మందూ తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో పుతిన్ ఓడిపోతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+