ఉక్రెయిన్‌పై రష్యా అణ్వాయుధ దాడిని ఒక్క ఫోన్ కాల్‌తో ఆపిన ప్రధాని మోదీ..!!
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.

రష్యా వెనకడుగు..
ఈ పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్ర అసహనానికి, అసంతృప్తి గురి చేస్తోన్నట్లుగా కనిపిస్తోంది. రోజుల తరబడి యుద్ధం సాగుతోండటం, నాలుగైదు కీలక నగరాలపై ఆధిపత్యాన్ని చేజార్చుకోవడం, తరచూ యుద్ధంలో వెనకడుగు వేస్తోండటం.. ఆయనను ఆగ్రహానికి గురి చేస్తోన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందటే ఉక్రెయిన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తోన్న సైన్యాధికారిని కూడా మార్చారాయన.

అణ్వాయుధ ప్రయోగం..
ఈ నేపథ్యంలో- వ్లాదిమిర్ పుతిన్ మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశం లేకపోలేదంటూ విదేశీ మీడియా అంచనా వేస్తోంది. అణు క్షిపణిని ప్రయోగించడానికీ పుతిన్ వెనుకాడే పరిస్థితులు లేవని చెబుతోంది. తమ ఆధీనంలో ఉన్న డొనాట్స్క్‌ను సైతం ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే దిశగా అడుగుల వేస్తోన్నందున పుతిన్- అణు క్షిపణిని ప్రయోగించడానికి మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోందక్కడి మీడియా.

తేల్చేసిన మోదీ, జిన్‌పింగ్..
ఈ వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ తమ వైఖరిని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను ప్రయోగించాలనే ఆలోచన రష్యాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని, భవిష్యత్‌లోనూ ఆ దేశం పట్ల ఉన్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చివేస్తుందని తేల్చి చెప్పారు. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్ ఈ విషయాన్ని తెలిపారు. అణు యుద్ధం ముప్పు గురించి ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ఆ సూచనలు లేవు..
అమెరికన్ మీడియా పీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను ఉపయోగించబోతోందనడానికి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించట్లేదని అన్నారు. అణ్వాయుధాల వినియోగంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు గ్ఝీ జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేయడం రష్యాపై ప్రభావం చూపాయని ఆయన చెప్పారు. వారిద్దరి ఆందోళన వల్లే రష్యా- అణ్వాయుధ ప్రయోగం వైపు మొగ్గు చూపి ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

భయపెట్టడానికే..
మోదీ, జిన్‌పింగ్ కూడా అణ్వాయుధాల వినియోగంపై తమ తమ ఆందోళనలను లేవనెత్తారని, అది రష్యా దూకుడును నియంత్రించినట్టుగా తాను భావిస్తున్నట్లు సీఐఏ చీఫ్ చెప్పారు. అణ్వస్త్రాలను ప్రయోగించితే అది రష్యాపై కూడా ప్రభావం చూపుతుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను భయపెట్టడానికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రతిపాదనలను తెర మీదికి తీసుకుని ఉండొచ్చని అన్నారు.

మోదీతో మాట్లాడిన పుతిన్..
మోదీకి రెండు రోజుల కిందటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసిన విషయం తెలిసిందే.జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఈ సదస్సులో పాల్గొంటానని సూచనప్రాయంగా వెల్లడించారు. జీ20 అధ్యక్ష పదవి లభించడంలో సహకరించారంటూ ప్రధాని మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంలోనే అణ్వస్త్ర ప్రయోగ ప్రతిపాదనల గురించి పుతిన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీకి బుజ్జగింపు..
కాగా- ఉక్రెయిన్‌పై అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని ప్రయోగించడానికి రష్యా సంసిద్ధంగా ఉందంటూ వార్తలు వెలువడిన రెండో రోజే పుతిన్.. ప్రధాని మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అణ్వాయుధాలను ప్రయోగించడానికి పుతిన్ సంసిద్ధతను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనను కలుసువడానికి మోదీ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనితో మోదీని బుజ్జగించడానికి పుతిన్ ఈ ఫోన్ కాల్ చేశారనే వాదనలు కూడా లేకపోలేదు.

శక్తిమంతమైన క్షిపణి..
ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని పుతిన్ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 1939-1945 మధ్యకాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై సంధించిన అణుబాంబు కంటే 12 రెట్లు శక్తిమంతమైన క్షిపణి ఇది. 1945 ఆగస్టు 6వ తేదీన బీ-29 బాంబర్ ద్వారా హిరోషిమాపై ఈ బాంబును జారవిడిచారు అమెరికా సైనికులు. ఈ దాడిలో లక్షమందికి పైగా మరణించారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications