వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం యుద్దేమే.. చర్చలు చర్చలే..! రెండో దఫా రష్యా-ఉక్రెయిన్ ప్రతినిదుల భేటీ..

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ - రష్యాల మధ్య భీకర యుద్ధపోరు కొనసాగుతోంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. అటు రష్యాకు చెందిన 9వేల మంది సైన్యాన్ని మట్టుబెట్టామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అన్నవిధంగా తలపడుతున్నాయి. ఖేర్సన్ నగరాన్ని రష్యా తన వశం చేసుకుంది. ఖార్కివ్ ను హస్తగతం చేసుకునేందుకు భీకరంగా ప్రయత్నిస్తుంది. ఉక్రెయిన్ కూడా అంతే ధైర్యంతో రష్యా సేనలను ప్రతిఘటిస్తోంది.

ఒక‌వైపు యుద్ధం.. మ‌రో వైపు చ‌ర్చ‌లు


ఒక వైపు యుద్ధం కొనసాగుతుండగానే.. ఉక్రెయిన్-రష్యాలు శాంతి చర్చలను రెండో ధపా చేపట్టాయి. యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాల చర్చలు ఫలప్రదం కావాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. సమస్యను చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని పేర్కొంటున్నాయి. ఈనేపథ్యంలో మరో సారి ఇరుదేశాలు చర్చలకు శ్రీకారం చుట్టాయి. ఈచర్చల ద్వారా ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందనడంలో సందేహం లేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. తమ డిమాండ్లు తక్కువగానే ఉన్నాయని తెలిపారు.

 ఉక్రెయిన్ డిమాండ్లు

ఉక్రెయిన్ డిమాండ్లు

ఫిబ్రవరి 28న బెలారస్ వేదికగా జరిగిన తొలి విడత రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగాయి. సుమారు నాలుగు గంటల పాటు ఆ చర్చలు సాగాయి. అయితే ఎవరి వాదలు వారివే అన్న విధంగా చర్చలు జరిగాయి. దీంతో ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభన నెలకొనడంతో ఆ చర్చలు విఫలమైయ్యాయి. గురువారం మరోసారి ఇరుదేశాల ప్రతినిధులు చర్చలకు శ్రీకారం చుట్టారు. అయితే దోనాస్క్, ల్యైనిస్క్ లను వదిలేయాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. తక్షణ యుద్ధవిరమణ, మానవతా కారిడార్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. అటు ఇరుదేశాలు పట్టువీడుపును వీడి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి.

 ప్రతిపైసా రష్యా తిరిగి చెల్లిస్తుంది

ప్రతిపైసా రష్యా తిరిగి చెల్లిస్తుంది

ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌ను పునర్నిర్మిస్తామని ఆదేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ష్పష్టం చేశారు. ప్రతిపైసా రష్యా తిరిగి చెల్లిస్తుందని అన్నారు. ఉక్రెయిన్ కు , తమ పౌరులకు కలిగిన నష్టానికి రష్యాదే భాద్యత అని పేర్కొన్నారు. వారి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఉక్రెనియన్ల గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తక్కువగా అంచనా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమల్ని నాశనం చేయాలని కలలు కంటుంది. కానీ ఏమీ చేయలేని హెచ్చరించారు. ఉక్రెయిన్‌ను మా పౌరులే రక్షించుకుంటున్నారని జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని రష్యా ఆపాలని లేకపోతే గుణపాఠం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

English summary
Russia -Ukraine talks second round at Belarus over Immediate ceasefire
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X