479 డ్రోన్లు.. 20 మిసైల్స్ తో రష్యా బిగ్గెస్ట్ ఎటాక్.. ఉక్రెయిన్ భూస్థాపితం..!
మూడేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈ మేరకు ఉక్రెయిన్ పై బిగ్గెస్ట్ ఎటాక్ చేసింది. 479 డ్రోన్లు, 20 మిస్సైల్స్ తో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే అతిపెద్ద దాడి కావడం సంచలనం రేపుతోంది. ఈ దాడులు ప్రధానంగా సెంట్రల్, వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతంలో జరిగింది. సోమవారం( మే 9) ఉక్రెయిన్ పై 479 డ్రోన్లు, 20 మిస్సైల్స్ తో దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ స్పష్టం చేసింది.
రష్యా జరిపిన దాడుల్లో సెంట్రల్, వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ ప్రాంతాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. మొత్తం 479 డ్రోన్లు, 20 క్షిపణులను ఉక్రెయిన్ పై ప్రయోగించగా వాటిల్లో 277 డ్రోన్లు, 19 క్షిపణులను మార్గం మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే తప్పించుకుని కొంత మేర నష్టాన్ని కలిగించినట్లు తెలిపింది.
సెంట్రల్, వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా దాడులు జరిపిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం క్లిష్టంగా ఉందని తెలిపారు. పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల మేర రష్యా దాడులు చేసిందని పేర్కొన్నారు. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ లోని పౌరుల నివాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో దాదాపు 12వేల మందికిపైగా ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే రష్యా మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తోంది. తాము కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాక రష్యా అర్థరాత్రి సమయంలో డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రాత్రి సమయంలో డ్రోన్ లను గుర్తించడం కొంచెం కష్టం కాబట్టి ఈ సమయాల్లోనే ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications