ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా .. రాత్రికి రాత్రే 550 డ్రోన్లు, 11 మిసైల్స్ తో దాడి..
ఉక్రెయిన్ పై రష్యా మరోసారి బిగ్గెస్ట్ ఎటాక్ చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పెను విధ్వంసం సృష్టించింది. 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విరుచుకుపడింది. కీవ్ తో పాటు ఇతర ప్రముఖ నగరాలే లక్ష్యంగా జులై 4న దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది గాయపడినట్లు సమాచారం. ఈ దాడులకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ అల్లకల్లోలం అయింది. రైల్వే వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. భారీ స్థాయిలో భవనాలు, కార్లు అగ్నికి దగ్ధమయ్యాయి.
ఉక్రెయిన్- రష్యా మధ్య గత మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై వరుసగా బిగ్గెస్ట్ ఎటాక్స్ చేస్తోంది రష్యా. ఇటీవల 477 డ్రోన్ లు, 60 మిసైల్స్ తో ఉక్రెయిన్ పై ఊహకందని విధ్వంసానికి పాల్పడింది రష్యా. తాజాగా మరోసారి అదే స్థాయిలో బిగ్గెస్ట్ ఎటాక్ చేసింది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో విరుచుకుపడింది. జులై 4 తెల్లవారుజాము నుంచి దాదాపు 8 గంటలపాటు రష్యా దాడులకు పాల్పడింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా ఇటీవలి కాలంలో రష్యా భారీ స్థాయిలో దాడులు చేస్తోంది. దీంతో రాజధాని నగరంలోని దాదాపు 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కీవ్ పై జరిపిన దాడుల్లో నగరంలోని రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసం అయినట్లు అక్కడి రైల్వే అధికారులు పేర్కొన్నారు. పలు రైళ్ల రాకపోకలను మళ్లించినట్లు తెలిపారు.

కీవ్ లక్ష్యంగా రష్యా 550 డ్రోన్ లు, 11 మిసైల్స్ తో దాడులు చేసింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. కీవ్ లోని 10 జిల్లాలకు గాను 6 జిల్లాల్లో నష్టం వాటిల్లింది. డినిప్రో నది చుట్టు ప్రక్కల ప్రాంతాలు దాడులకు ధ్వంసం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో డ్రోన్ శకలాలు పడిపోయాయి. అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. రష్యన్ బలగాలు కీవ్ పై రసాయనక దాడులు కూడా చేపట్టిందని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని కిటికీలు మూసేసి ఇంట్లోనే ఉండాలని కీవ్ మిలిటరీ అధికారి తైముర్ తెలిపారు.
Absolutely horrible and sleepless night in Kyiv. One of the worst so far.
— Andrii Sybiha 🇺🇦 (@andrii_sybiha) July 4, 2025
Hundreds of Russian drones and ballistic missiles rained down on the Ukrainian capital.
Right after Putin spoke with President Trump. And he does it on purpose.
Enough of waiting! Putin clearly shows… pic.twitter.com/R0mlfUgJRx
రష్యా దాడులకు కీవ్ లోని ప్రజలు ఆశ్రయం కోసం పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రష్యా ప్రయోగించిన ఆయుధాల్లో 478 ఆయుధాలను నేల కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. కీవ్ తో పాటు దేశవ్యాప్తంగా 8 నగరాలపై దాడులు చేసింది రష్యా. ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 23 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Morning in Kyiv. No sleep. Air quality is extremely bad. City is covered in thick smoke.
— Maria Avdeeva (@maria_avdv) July 4, 2025
This is Russian terror, aimed at people who chose to stay, resist and fight. pic.twitter.com/a1pCBzHUOt
ఇటీవల సైతం ఉక్రెయిన్ పై రష్యా బిగ్గెస్ట్ ఎటాక్ చేసింది. 477 డ్రోన్ లు, 60 క్షిపణులతో దాడులు చేసింది. ఆ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై విరుచుకుపడ్డారు. పుతిన్ యుద్ధాన్ని కొనసాగించాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications