షాకిచ్చిన రష్యా: ఆ బాంబు పడితే ఒక దేశం ఔట్
మాస్కో: ప్రపంచంలోని శత్రు దేశాలకు హడలుపుట్టించడానికి రష్యా సిద్దం అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక అణు క్షిపణి తయారు చెయ్యాలని రష్యా నిర్ణయం తీసుకుంది.
దాదాపు 6,000 మైళ్లు (9,600 కిలోమీటర్లు) దూరంలోని లక్షాలను సమర్థవంతంగా అణు క్షిపణి చేరుకునేలా సతాన్-2 అనే అణు క్షిపణి రూపొందించాలని ప్రణాళిక తయారు చేసుకుంది. ఈ అణు క్షిపణికి ఒకే సారి 16 ప్రాంతాల్లో దాడిచేసే సత్తా ఉందని రష్యా పేర్కొంది.

వినడానికి భయంగా ఉన్న సతాన్-2 అణు క్షిపణి బటన్ ఒక్కసారి నొక్కితే ఫ్రాన్స్ లాంటి దేశాన్ని సర్వనాశనం చేసే సత్తా దీని సొంతం అని రష్యా పేర్కొంది. దీనిని కేవలం రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురావడమే లక్షంగా పెట్టుకున్నామని రష్యా ప్రకటించింది.
సతాన్-2 క్షిపణి ప్రయోగిస్తే ఏర్పడే తీవ్రతను తెలియజేసే చిత్రాలను, ప్రణాళికను రష్యా విడుదల చేసింది. అమెరికా, జపాన్ చేసిన అణు బాంబుల కంటే సతాన్-2 అణు క్షిపణి వెయ్యి రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగింది. రష్యా భయంకరమైన అణు క్షిపణి తయారు చేయ్యడానికి సిద్దం అయిన నేపధ్యంలో ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications