రష్యాలో కూలిన సైనిక స్థావరం: 23మంది మృతి
మాస్కో: రష్యాలోని సైబెరియాలో సైనిక స్థావరం ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 23 మంది సైనికులు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఒమస్క్ పట్టణం సమీపంలో సైనికులకు శిక్షణ ఇచ్చే ప్రదేశంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
భవన శిథిలాల నుంచి 37 మందిని బయటకు తీయగా, అందులో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మరణించారు.

ఇంకా ఆ శిథిలాలకింద చిక్కుకున్నవారి కోసం అధికారులు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ అధికారంగా వెల్లడించింది.
ఈ ఘటనలో గాయపడిన మరో 19 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications