వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్డ్ వార్‌కు సంకేతమా?: 60 మంది రష్యా దౌత్యవేత్తలపై ట్రంప్ బహిష్కరణాస్త్రం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: మళ్లీ రష్యా, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు నెలకొన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకేసారి తమదేశంలోని 60 మంది రష్యా దౌత్యవేత్తలు తక్షణమే వెళ్లిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా దౌత్యయుద్ధం ప్రకటించాయి. ట్రంప్ మరో అడుగు ముందుకేసి సియాటెల్‌ నగరంలోని రష్యా కాన్సులేట్‌ కార్యాలయాన్నిమూసి వేయాలని ఆదేశించారు.

రష్యా రాయబారులుగా పని చేస్తున్న వారంతా నిఘా అధికారులని అమెరికా అనుమానిస్తున్నది. ట్రంప్ బహిష్కరించిన 60 మంది రష్యా దౌత్యవేత్తల్లో 12 మంది ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో పని చేస్తున్నారు. తమదేశంలో 100 మంది రష్యా నిఘా అధికారులు పని చేస్తున్నట్లు అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు.

వచ్చేనెల రెండో తేదీలోగా రష్యా దౌత్యవేత్తలు దేశం వీడాలి

వచ్చేనెల రెండో తేదీలోగా రష్యా దౌత్యవేత్తలు దేశం వీడాలి

సియాటెల్‌లోని జలాంతర్గామి, బోయింగ్ యుద్ధవిమాన స్థావరాలపై రష్యా కుట్ర జరిపే అవకాశం ఉన్నదని అనుమానించింది. సియాటెల్‌లోని రష్యా కాన్సులేట్‌ను మూసేయాలని కూడా ట్రంప్ ఆదేశించారని వైట్‌హౌస్ సోమవారం తెలిపింది. దౌత్యవేత్తలంతా తమ కుటుంబాలతో కలిసి వచ్చేనెల రెండో తేదీ లోగా దేశాన్ని వీడాలని ట్రంప్ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. అమెరికా చరిత్రలో భారీస్థాయిలో రష్యా దౌత్యాధికారుల్ని బహిష్కరించడం ఇదే తొలిసారి.

వారం క్రితమే పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు

వారం క్రితమే పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందనలు

తాము ఎటువంటి తప్పిదానికి పాల్పడలేదని, అకారణంగా తమపై చర్యలకు దిగిన అమెరికా, బ్రిటన్ తదితర యూరప్ దేశాలకు ప్రతిగా చర్యలు తప్పవని రష్యా హెచ్చరించింది. గమ్మత్తేమిటంటే గత వారం నాలుగోసారి రష్యా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌ను ఫోన్‌లో అభినందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం తిరక్కుండానే రష్యాపై ఆంక్షలు విధించడం గమనార్హం.

 ట్రంప్ చర్యలపై రష్యన్ల మండిపాటు

ట్రంప్ చర్యలపై రష్యన్ల మండిపాటు

ఓ వైపు రష్యాతో మైత్రి కోరుకుంటున్నామని బుకాయించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు రష్యాను ఏకాకి చేయాలనే అమెరికా నైజం మరోసారి బట్టబయలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రశంసలు గుప్పించిన ట్రంప్‌ విధానాల్లో, ఆలోచన తీరులో క్రమక్రమంగా పెను మార్పులు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ చర్యల పట్ల రష్యన్లు మండిపడుతున్నారు.

అమెరికా, ఈయూ దేశాల నిర్ణయాన్ని స్వాగతించిన బ్రిటన్

అమెరికా, ఈయూ దేశాల నిర్ణయాన్ని స్వాగతించిన బ్రిటన్

ఐక్యరాజ్య సమితిని స్వర్గధామంగా చేసుకుని తమ సరిహద్దుల్లోపలే రష్యా ప్రమాదకర చర్యలకు దిగిందని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఆందోళన వ్యక్తం చేశారు. 2016 చివరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా.. ఎన్నికల వేళ ట్రంప్ నకు అనుకూలంగా వ్యవహరిస్తున్న 35 మంది రష్యా ఏజంట్లను బహిష్కరించిన తర్వాతే అత్యధిక మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించడం ఇదే మొదటిసారి. కాగా, కెనడా నలుగురు, ఉక్రెయిన్ 13 మంది దౌత్యవేత్తలను బహిష్కరించినట్లు ధ్రువీకరించాయి. బ్రస్సెల్స్‌లో గతవారం జరిగిన సదస్సులో ఈయూకు చెందిన 28 సభ్యదేశాలు తమ దేశాల్లోని రష్యా దౌత్యవేత్తలను పంపించాలని కుట్రపన్నాయి. దీనిపై ప్రతిస్పందించిన బ్రిటన్.. తన మిత్ర దేశాల చర్యను స్వాగతించింది. ఇది తమ నైతిక విజయమని పేర్కొన్నది.

రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈయూ సభ్యదేశాలు

రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈయూ సభ్యదేశాలు

బ్రిటన్‌లో ఒక గూఢచారిపై నర్వ్‌ ఏజెంట్‌ సాయంతో విష ప్రయోగం జరిగింది. రష్యా దౌత్యవేత్తల కనుసన్నల్లోనే ఈ అఘాయిత్యం జరిగిందని ఆరోపణలు చేసిన బ్రిటన్‌ అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయింది. నర్వ్‌ఏజెంట్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను రష్యా కోరినా పంపలేదు. అంతేకాక, ఇతర దేశాలను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా దౌత్యవేత్తలను బ్రిటన్‌ నుంచి పంపింది. బ్రిటన్‌ బాటలోనే జర్మనీ, ఫ్రాన్స్‌, ఉక్రెయిన్‌, అమెరికా దేశాలు ప్రయాణించేందుకు ప్రయత్నించడం శోచనీయం. రష్యాను ఒంటరి చేయాలనే ప్రయత్నాలు ఆయా దేశాలు కొనసాగిస్తున్నాయి.

మాస్కో వివరణతో త్రుప్తి చెందని అమెరికా, దాని మిత్రదేశాలు

మాస్కో వివరణతో త్రుప్తి చెందని అమెరికా, దాని మిత్రదేశాలు

దక్షిణ ఇంగ్లాండ్‌లోని సాలిస్‌బర్రీ నగరంలో బ్రిటిన్‌కు చెందిన మాజీ నిఘా అధికారి స్క్రిపాల్‌, అతని కూతురు యూలియాపై జరిగిన విష ప్రయోగానికి, తమకు ఎలాంటి సంబంధంలేదని రష్యా విదేశాంగ శాఖ పలుమార్లు వివరణ ఇచ్చినా ఈయూ మిత్రదేశాలు, అమెరికా విశ్వసించడం లేదు. అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు తీసుకున్న నిర్ణయాలపై తాము కూడా తీవ్రస్థాయిలో నిరసన తెలియజేస్తామని రష్యా తెలిపింది. సుమారు 30 పాశ్చాత్య దేశాల రాయబారులను బహిష్కరించాలని రష్యా యోచిస్తోంది.

English summary
Washington led the way, ordering out 60 alleged agents, in a new blow to US-Russia ties less than a week after President Donald Trump congratulated Vladimir Putin on his re-election. Canada, Ukraine and fourteen European Union states matched the move with smaller-scale expulsions, after Britain urged allies to respond to the poisoning of double agent Sergei Skripal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X