ఐఎస్‌కు అమెరికా సాయం: ఇదే రుజువంటూ రష్యా, అసలు నిజం ఏమిటంటే?(వీడియో)

Subscribe to Oneindia Telugu

మాస్కో: అమెరికాపై రష్యా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. సిరియాలో ఐసిస్‌ ఉగ్రవాదులకు అమెరికా సాయం చేస్తుందంటూ.. అందుకు ఇవే రుజువులంటూ రష్యా రక్షణ శాఖ మంగళవారం కొన్ని చిత్రాలను విడుదల చేసింది. అయితే, అవి కొన్ని వీడియోగేమ్‌ల నుంచి సేకరించిన దృశ్యాలని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

సిరియా-ఇరాక్‌ సరిహద్దుల్లో నవంబర్‌ 9న తీసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను రష్యా రక్షణ శాఖ పోస్ట్‌ చేసింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల వాహనాలు గత వారం సిరియాలోని ఓ పట్టణాన్ని వదిలి వెళ్తున్నప్పుడు అమెరికా దళాలు సాయం చేసినట్లు తెలిపింది. ఉగ్రవాదులకు అమెరికా సాయం చేస్తుందనడానికి ఈ చిత్రాలు తిరస్కరించలేని రుజువులని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రాల్లో ఒకటి వార్‌ గేమ్‌ 'ఏసీ-130 గన్‌షిప్‌ సిమ్యులేటర్‌' లోనిదని కాన్‌ఫ్లిక్ట్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ (సీఐటీ), సోషల్‌ మీడియా యూజర్లు చెబుతున్నారు. ఇతర చిత్రాలు 2016 జూన్‌లో ఇరాక్‌ వాయుసేన ఐఎస్‌ ఉగ్రవాదులపై దాడి చేసిన ఫొటోలను పోలి ఉన్నాయని ఆరోపించారు.

కాగా, ఈ విమర్శల నేపథ్యంలో వెంటనే తప్పును గ్రహించిన రష్యా రక్షణ శాఖ ఆ ఫొటోలను ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల నుంచి తొలగించింది. పొరపాటుగా వాటిని పోస్టు చేసినట్లు వెల్లడించింది. అయితే తాము చేస్తున్న ఆరోపణలను మాత్రం వెనక్కి తీసుకోలేదని చెప్పడం గమనార్హం. రష్యా, అమెరికాకు చాలా కాలం నుంచి అంతర్గత శత్రుత్వం ఉన్న విషయం తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా ఇరుదేశాలు ఒకదానిపై మరోటి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Russia’s Ministry of Defense released startling visual proof this morning that the United States military is assisting ISIS. The only problem with Russia’s claims? The photographic “evidence” actually came from a video game.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి