రష్యా విధ్వంసం : కీవ్, మరియుపోల్‌లో నాన్‌స్టాప్‌గా బాంబుల వ‌ర్షం.! ల్యాండ్‌మైన్‌ల‌తో నిండిన‌ రోడ్లు.!!

ఉక్రెయిన్‌పై రష్యా బాంబులు, క్షిపణులతో విరుచుపడుతోంది. కీవ్ , ఖర్కివ్, మరియుపోల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను తీవ్రతరం చేసింది. బాంబుల మోతతో ఉక్రెయిన్ దేశ పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భవనాలు పూర్తిగా ధ్వంసం కావడంతో మానవతా కారిడార్‌లకు తరలిపోతున్నారు. ఏ వైపు చూసినా భయానక వాతావరణ పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఆహార కొరత వెంటాడుతుంది. నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.

మ‌సిదిబ్బ‌లుగా న‌గ‌రాలు

మ‌సిదిబ్బ‌లుగా న‌గ‌రాలు

రాజధాని కీవ్ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంది. గత 27 రోజులుగా దాడులు జరుగుతున్న‌ప్ప‌టికీ ఈ న‌గ‌రంపై పూర్తి స్థాయిలో రష్యా సేనలు పట్టుసాధించలేకపోయాయి . దీంతో దాడులను తీవ్రతరం చేశాయి . కిపణులు, బాంబులతో రష్యా దళాలు విరుచుకుపడున్నాయి. భీకర పోరు సాగిస్తున్నాయి. భారీ భవనాలు, షాపింగ్ మాల్స్ బాంబులతో పేల్చేస్తున్నాయి. క్షిపణుల దాడులతో నివాసభవనాలు నేలమట్టం అవుతున్నారు. సుందర భవనాలు మసిదిబ్బలుగా మారాయి. కీవ్ నగరంలో రోడ్లన్నీ ల్యాండ్‌మైన్‌లతో నిండిపోయాయి. బాంబుల దాటికి రోడ్లన్నీ ధ్వంసమైయ్యాయి.

 నాన్‌స్టాప్‌గా బాంబులు వ‌ర్షం

నాన్‌స్టాప్‌గా బాంబులు వ‌ర్షం

చెర్న్‌హీవ్ లో పరిస్థితి ఘోరంగా ఉంది. అందుబాటులో నీరు, ఆహారం లేక పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడ పరిస్థితులను ఉక్రెయిన్ ఎంపీ లేసియా వాసిలెంకో ట్విట్టర్ ద్వారా వివరించారు. లక్షలాది మంది పౌరులు ఈ చెర్ హీవ్ నగరంలో చిక్కుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అటు మరియుపోల్‌లో రష్యా దళాలుు నాన్‌స్టాప్‌గా బాంబు దాడులు చేస్తున్నాయి. స్వాధీనం చేసుకునేందుకు ర‌ష్యా ద‌ళాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈన‌గ‌రానికి న‌లుదిక్క‌లా ర‌ష్యా సేన‌లు చుట్టుముట్టాయి. ప్ర‌తి ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు బాంబుల‌తో దాడులు చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలను సుర‌క్షిత ప్రాంతాల‌కు అధికారులు తరలిస్తున్నారు. అటు చిన్నారులు ఆహారం, నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చిన్నారులు కూడా మరణించారు.

మంట‌ల్లో గుర్రాలు స‌జీవ‌ద‌హ‌నం


రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం జరిగింది. రష్యా సైనిక చర్చలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 651 నివాస భవనాలు ధ్వంసం అయ్యాయి. అటు 3,780 భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ స్టేట్ ఎమరజెన్సీ సర్వీసెస్ తెలిపింది. ర‌ష్యా దాడుల‌కు భారీ సంఖ్యలో జంతు జీవాలు కూడా మృతి చెందాయి . రష్యా బాంబుల దాటికి హోస్టోమెల్‌లోని అనేక గుర్రాలు మంటల్లో సజీవదహనమయ్యాయి. వీటిలో కొన్ని మాత్రమే తప్పంచుకోగలిగాయని ఉక్రెయిన్ తెలిపింది. యుద్దం భయంతో ఇప్పటి వరకు 10 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని వీడి వెళ్లినట్లు ఐరాస వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+