Russian Ukraine War: లక్ష మందిని పంపించేశాము, చేసిన పాపం ఊరికేపోదు, జెలెన్ స్కీ ఫైర్ !
ఉక్రెయిన్: రష్యా ఆరాచకాలకు అడ్డుఅదుపు లేకుండాపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరామం (యుద్ద విరామం) ఉల్లంఘనకు పాల్పడిన రష్యా బలగాలు ఆసుపత్రుల మీద దాడులు చేస్తోందని, అమాయకులు బలి అవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. మానవతా విలువలు కాలరాస్తున్న రష్యాకు సరైన బుద్ది చెబుతామని జెలెన్ స్కీ హెచ్చరించారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు మరియుపోల్ నగరంలోని ప్రజలు ఆహారం, తాగడానికి నీళ్లు అందకపోవడంతో అలమటిస్తున్న లక్ష మంది సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. యుద్ద విరామం ప్రకటించామని పైకి చెబుతున్న రష్యా బలగాలు దొంగచాటుగా ఆసుపత్రులు, సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తోందని, అమాయకులు ఏం పాపం చేశారు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు. ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ జాతీయులు పొరుగు దేశాలకు వలసలు వెళ్లారు. అందులో సగానికి సగం చిన్నారులే ఉన్నారని ప్రత్యక్ష సాక్షలు అంటున్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇంత జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Recommended Video

రష్యా అరాచకాలు ఎక్కువైనాయి
రష్యా ఆరాచకాలకు అడ్డుఅదుపు లేకుండాపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మీద పగతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అమాయకులైన ప్రజల మీద దాడులు చేసి పరోక్షంగా మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.

యుద్ద విరామం అంటూనే దాడులు చేస్తారా ?
కాల్పుల విరామం ఉల్లంఘనకు పాల్పడిన రష్యా బలగాలు ఆసుపత్రుల మీద దాడులు చేస్తోందని, అమాయకులు బలి అవుతున్నారని, యుద్ద విరామం అని ప్రపంచ దేశాలకు నమ్మిస్తున్న రష్యా పదేపదే దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. మానవతా విలువలు కాలరాస్తున్న రష్యాకు సరైన బుద్ది చెబుతామని జెలెన్ స్కీ హెచ్చరించారు.

రెండు రోజుల్లో లక్ష మందిని తరలించాము
రష్యా దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంతో పాటు మరియుపోల్ నగరంలోని ప్రజలు ఆహారం, తాగడానికి నీళ్లు అందకపోవడంతో అలమటిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల నుంచి మరియుపోల్ నగరంలోని లక్ష మంది సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.

సామాన్య ప్రజలు ఏం పాపం చేశారు ?
యుద్ద విరామం ప్రకటించామని పైకి చెబుతున్న రష్యా బలగాలు దొంగచాటుగా ఆసుపత్రులు, సామాన్య ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేస్తోందని, అమాయకులు ఏం పాపం చేశారు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రశ్నించారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రష్యాకు ఉసురు తగులుతుందని, చేసిన పాపం ఊరికేపోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

20 లక్షల మంది పారిపోయారు
ఇప్పటికే 20 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ జాతీయులు పొరుగు దేశాలకు వలసలు వెళ్లారు. అందులో సగానికి సగం చిన్నారులే ఉన్నారని ప్రత్యక్ష సాక్షలు అంటున్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇంత జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications