బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Russian Ukraine War: లంచం వసూలు చేసిన ఉక్రెయిన్ పోలీసులు, తప్పించుకున్న సోదరులు !

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్/బెళగావి/బెంగళూరు: ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం ప్రకటించిన తరువాత ఆదేశంలోని భారతీయులు అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు అందరినీ స్వదేశానికి తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న ఇద్దరు సోదరులు సురక్షితంగా బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. సొంత సోదరులు ఇద్దరూ ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నారు.

రష్యా యుద్దం మొదలు పెట్టిన తరువాత నాలుగు రోజుల నుంచి ఖార్కివ్ లోని బంకర్లలో తలదాచుకున్న సోదరులు ఇప్పుడు ప్రాణాలకు తెగించి బయటకు వచ్చారు. సురక్షిత ప్రాంతానికి పారిపోవడానికి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారని, వారికి 100 డాలర్లు లంచం ఇచ్చి మేము రైలులో ప్రయాణిస్తున్నామని సోదరులు ప్రముఖ కన్నడ మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. నాలుగు రోజుల నుంచి సరైన ఆహారం లేదని, తాగడానికి నీళ్లు కూడా లేవని, ఖార్కివ్ నగరం నుంచి బతికి బయటపడితే చాలని ఆ దేవుడిని వేడుకున్నామని, ఇదే సమయంలో మా స్నేహితుడు నవీన్ ప్రాణాలు పోయాయని తెలిసి హడలిపోయామని సోదరులు కన్నడ మీడియాకు చెప్పారు. యుద్దం జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు లంచాలు అడగడంతో మేము షాక్ అయ్యామని ఆ సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. 700 కిలోటమీలర్ల దూరంలో ఉన్న సురక్షిత ప్రాంతానికి మేము రైలులో ప్రయాణిస్తున్నామని సోదరులు కన్నడ మీడియాకు ఫోన్ చేసి చెప్పారు.

Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !

 ఉక్రెయిన్ లో భారతీయులు

ఉక్రెయిన్ లో భారతీయులు

ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం ప్రకటించిన తరువాత ఆదేశంలోని భారతీయులు అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. భారతీయులు అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పదేపదే కేంద్ర ప్రభుత్వం మనవి చేసింది.

 26 విమానాలు సిద్దం చేసిన కేంద్ర ప్రభుత్వం

26 విమానాలు సిద్దం చేసిన కేంద్ర ప్రభుత్వం

మూడు రోజుల్లో 26 విమానాల ద్వారా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు అందరినీ స్వదేశానికి తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న కేంద్ర విదేశాంగ శాఖ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించింది.

 ఉక్రెయిన్ లో అన్నాతమ్ముడు

ఉక్రెయిన్ లో అన్నాతమ్ముడు

కర్ణాటకలోని బెళగావి జిల్లా తెలసంగ గ్రామానికి చెందిన నాగేష్ పూజారి, రాకేష్ పూజారి అనే అన్నాతమ్ముడు ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నారు. ఇంతకాలం హ్యాపీగా చదువుకుంటున్న సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి రష్యా దాడులతో ప్రాణం భయంతో హడలిపోయి బంకర్లలో తలదాచుకున్నారు.

 ఖార్కివ్ లో రష్యా మెరుపుదాడులు

ఖార్కివ్ లో రష్యా మెరుపుదాడులు

ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి సురక్షితంగా బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది. సొంత సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి ఇద్దరూ ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నారు. రష్యా యుద్దం మొదలు పెట్టిన తరువాత నాలుగు రోజుల నుంచి ఖార్కివ్ లోని బంకర్లలో తలదాచుకున్న సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి ఇప్పుడు ప్రాణాలకు తెగించి బంకర్లలోని బయటకు వచ్చారు.

 పోలీసులకు 100 డాలర్లు లంచం ఇచ్చిన సోదరులు

పోలీసులకు 100 డాలర్లు లంచం ఇచ్చిన సోదరులు

రాఖివ్ లోని సురక్షిత ప్రాంతానికి పారిపోవడానికి రైలు ఎక్కడానికి ప్రయత్నించిన మమ్మల్ని ఖార్కివ్ లో పోలీసులు అడ్డుకున్నారని, వారికి 100 డాలర్లు లంచం ఇచ్చి మేము రైలులో ప్రయాణిస్తున్నామని, మేము మొత్తం 15 మంది భారతీయులు ఉన్నామని సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి ప్రముఖ కన్నడ ప్రజావాణి దినపత్రికకు ఫోన్ చేసి చెప్పారు.

 ప్రాణాలు ఉంటే చాలు దేవుడా

ప్రాణాలు ఉంటే చాలు దేవుడా

నాలుగు రోజుల నుంచి సరైన ఆహారం లేదని, తాగడానికి నీళ్లు కూడా లేవని, ఖార్కివ్ నగరం నుంచి బతికి బయటపడితే చాలని ఆ దేవుడిని వేడుకున్నామని, ఇదే సమయంలో కర్ణాటకలోని హావేరికి చెందిన మా స్నేహితుడు నవీన్ ప్రాణాలు పోయాయని తెలిసి హడలిపోయామని సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి ప్రముఖ కన్నడ దినపత్రిక ప్రజావాణికి ఫోన్ చేసి చెప్పారు.

Recommended Video

Russia-Ukraine Conflict : భావిభారత పౌరులని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే | Oneindia Telugu
 మద్యలో ఫోన్ లు కట్

మద్యలో ఫోన్ లు కట్

యుద్దం జరుగుతున్న సమయంలో కూడా పోలీసులు లంచాలు అడగడంతో మేము షాక్ అయ్యామని నాగేష్ పూజారి, రాకేష్ పూజారి ఆవేదన వ్యక్తం చేశారని కన్నడ దినపత్రిక ప్రజావాణి తెలిపింది. ఖార్కివ్ నుంచి 700 కిలోటమీలర్ల దూరంలో ఉన్న సురక్షిత ప్రాంతానికి మేము రైలులో ప్రయాణిస్తున్నామని సోదరులు నాగేష్ పూజారి, రాకేష్ పూజారి కన్నడ దినపత్రిక ప్రజావాణికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఒక్కసారిగా సోదరులు ఫోన్ లు అందుబాటులోకి రాకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనారు. కొన్ని గంటల తరువాత మళ్లీ సోదరుల ఫోన్లు పని చేశామని కన్నడ మీడియా అంటోంది.

English summary
Russian Ukraine War: Karnataka brothers from Belgaum who left Kharkeev in Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X