టర్కీ బోటుపై రష్యా యుద్దనౌక కాల్పులు

రష్యా: టర్కీ దేశంపై రష్యా కారాలు, మిరియాలు నూరుతున్నది. టర్కీ దేశానికి చెందిన బోటు మీద రష్యా యుద్ద నౌన కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా, గాయపడ్డారా అనే విషయం మాత్రం వెలుగు చూడలేదు.

ఈ దెబ్బతో రెండు దేశాల మద్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం ఏజియన్ సముద్రంలోని లిమ్నస్ గ్రీకు దీవులకు 22 కిలోమీటర్ల దూరంలో టర్కీ బోటు ఒకటి వెళ్లింది. అదే సమయంలో అటువైపు రష్యా యుద్ద నౌక వెలుతున్నది.

 Russian warship fires warning shots at Turkish boat

ఎదురుగా వచ్చి తమ యుద్ద నౌకను డీకొనడానికి టర్కీ బోటు ప్రయత్నించిందని, హెచ్చరిక కాల్పులు జరిపామని రష్యా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాణ నష్టం జరిగిందా అనే విషయం తెలియడం లేదని అధికారులు వివరించారు.

తమ యుద్ద విమానాన్ని కూల్చివేసి సైనికులను టర్కీ అంతం చేసిందని రష్యా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. తాజాగా జరిగిన ఈసంఘటనతో ఇరు దేశాలమ మద్య మరింత వివాదం మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+