అణు పరీక్షకు సిద్ధమైన రష్యా..? ఇక అమెరికాకు దబిడిదిబిడే..
రష్యా అణు పరీక్షలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రష్యా డిఫెన్స్ మంత్రి ఆండ్రీ బెలౌసో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఫుల్ రేంజ్ లో అణు పరీక్షలు నిర్వహించేందుకు ఇది సరైన సమయం అని పేర్కొన్నారు. రష్యాలోని నొవాయా జెమిలీ సైట్ లో ఈ న్యూక్లియర్ టెస్ట్ లు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు స్థానిక మీడియా సంస్థలు TASS, RIA స్పష్టం చేశాయి. 21 సెంచరీలో కేవలం నార్త్ కొరియా మాత్రమే న్యూక్లియర్ టెస్టు చేపట్టింది. 2017 లో నార్త్ కొరియా న్యూక్లియర్ టెస్ట్ చేపట్టింది. ఇటీవల రష్యా రెండు అణ్వాయుధాలను టెస్టింగ్ చేసినప్పటికీ అవి తక్కువ ఫలితాలు వచ్చేవి కాగా.. ఫుల్ స్కేల్ విస్పోటనం కానివని స్పష్టం అవుతోంది.
అణు పరీక్షలు నిర్వహించేందుకు రష్యా సిద్దంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హింట్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు నిర్వహిస్తే తాము కూడా అణు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తేల్చినట్లు సమాచారం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా త్వరలోనే న్యూక్లియర్ టెస్టులను ప్రారంభిస్తుందని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కౌంటర్ ఇచ్చారు.
నవంబర్ 5, బుధవారం మాస్కోలో జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో పుతిన్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. అమెరికా స్టార్ట్ చేస్తే.. తాము కూడా స్టార్ట్ చేస్తామన్నారు. ఈ మేరకు పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు పుతిన్ సూచించారు. తమ దేశ న్యూక్లియర్ శక్తి.. అన్ని దేశాలకంటే అగ్రస్థానంలో ఉందని పుతిన్ స్పష్టం చేశారు. న్యూక్లియర్ టెస్టులో మోడ్రన్ పద్ధతిలో తాము ఉన్నట్లు తెలిపారు.

21వ శతాబ్దంలో కేవలం నార్త్ కొరియా మాత్రమే అణు పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించింది. 2017 లో నార్త్ కొరియా అణు పరీక్షలను చేపట్టింది. ఇక నవంబర్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు న్యూక్లియర్ టెస్టులు చేపడుతున్నాయి. పాకిస్థాన్, నార్త్ కొరియా, చైనా, రష్యా రహస్యంగా అండర్ గ్రౌండ్ లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల తాము కూడా న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications