పాక్‌లో మానవహక్కుల మహిళ నేత కాల్చివేత
కరాచి: పాకిస్థాన్ లో తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్నమానవ హక్కుల మహిళ నేతను దారుణంగా కాల్చి చంపేశారు. సబీన్ మహమ్మద్ (40) అనే మహిళ హత్యకు గురైనారు. ఆమె తల్లికి బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.
శుక్రవారం రాత్రి కరాచిలోని ఒక హోటల్ లో సైలెన్సింగ్ బెలూచిస్థాన్ పేరుతో ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సబీన్ మహమ్మద్ పాల్గోని ప్రసంగించారు. తరువాత తల్లితో కలిసి కారులో వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు.

హోటల్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఇద్దరు తీవ్రవాదులు కారు మీద తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
చికిత్స విఫలమై సబీన్ మహమ్మద్ మరణించారని పోలీసు అధికారి తారిఖ్ దరేజో తెలిపారు. బెలూచిస్తాన్ లో అమాయకులను పోలీసులు నిర్దాక్షణంగా కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ ఈమె చాల సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications