లైంగిక ఆరోపణలు: అనుమానాస్పదస్థితిలో మాజీ మంత్రి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కార్టిఫ్: వేల్స్‌ దేశంలో ఓ మాజీ మంత్రి మరణం మిస్టరీగా మారింది. కేబినెట్ మాజీ కార్యదర్శి మంత్రిగా విధులు నిర్వహించిన కార్ల్‌ సర్గంట్‌, క్వే పట్టణంలోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఆయన మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

49 ఏళ్ల సర్గంట్‌ పై కొన్నాళ్ల క్రితం లైంగిక ఆరోపణలు వచ్చాయి. వరుసపెట్టి పలువురు మహిళలు ఆయన తమను లైంగికంగా వేధించారంటూ మీడియా ముందుకు వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తప్పించింది. అంతేకాదు దర్యాప్తునకు ఆదేశించింది. అయితే తనకు ఏ పాపం తెలీయదని ఆయన ఖండించారు.

Sacked Labour minister Carl Sargeant found dead

కుట్రతో తనను ఇరికించారని.. అమాయకుడినంటూ మొదటి నుంచి కార్ల్‌ వాదిస్తూ వస్తున్నారు. అంతేకాదు అవసరమైతే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించుకున్నారు.

కానీ, ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దీంతో కొన్నాళ్లుగా ఆయన మానసికంగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన సూసైడ్‌ చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇక సర్గంట్ మృతి పట్ల లేబర్‌ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది..

ఆ పార్టీ మాజీ నేత జెర్మీ కార్బైన్‌ తన ట్విట్టర్‌లో సంతాపం తెలియజేశారు. కార్ల్‌ సర్గంట్‌ మృతికి సంతాపంగా వెల్స్‌ మంగళవారం జరగాల్సిన పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An ex-Welsh Labour minister who faced a party investigation into allegations about his personal conduct has taken his own life, it is understood.Carl Sargeant, 49, lost his job as cabinet secretary for communities and children last Friday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి