• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాజిదా అల్ రిశ్వాయ్: ఐసిస్ సందేశం అదేనా? జోర్డాన్ ప్రతిచర్య

By Srinivas
|

అమ్మన్: ఐసిస్ తీవ్రవాదులు పైలట్ మాజ్ అల్ కస్సాస్బేను చంపేయడం, ఆ తర్వాత దానికి ప్రతీకారంగా జోర్డాన్ ఇద్దరు తీవ్రవాదులను ఉరివేయడం తెలిసిందే. ఈ విషయమై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము సోదరిగా పేర్కొంటున్న సాజిదాను విడిపించడం పైన ఐసిస్ తీవ్రవాదులు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని దీని ద్వారా అర్థమవుతోందంటున్నారు.

సాజిదాను విడుదల చేయాలని ఐసిస్ డిమాండ్ చేస్తోంది. 2005లో జోర్డాన్‌లోని ఓ హోటల్లో సూసైడ్ బాంబ్‌గా ఆమె వెళ్లింది. ఈ ఘటనలో ఆమె భర్త చనిపోయాడు. ఆమె మాత్రం బతికింది. అయితో, ఆమె పోలీసులకు చిక్కింది. ఇదిలా ఉండగా ఐసిస్ తీవ్రవాద సంస్థ సున్నీ ముస్లీంల రక్షణ కోసమే ముఖ్యంగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

ఐసిస్ ఇటీవలే పుట్టుకు వచ్చిన తీవ్రవాద సంస్థ. దాదాపు ప్రపంచవ్యాప్తంగా దానికి మూలాలు కనిపిస్తున్నాయి. తాము సున్నీలకు రక్షణగా ఉంటామని ఐసిస్ సందేశంగా కనిపిస్తోందని అంటున్నారు.

Sajida Al-Rishwai- ISIS' message was only we protect Sunnis

ఐసిస్ ఉగ్రవాదులు తమ సోదరిగా చెబుతున్న సాజిదా ఆల్ రిశ్వాయ్ ఇరాక్‌లోని ప్రముఖ అన్బర్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ. ఆమె అబు రిషా వర్గానికి చెందినది. ఇది సున్నీ వర్గానికి చెందినదిగా తెలుస్తోంది. షియా వర్సెస్ సున్నీ యుద్ధంలో తాము సున్నీల వైపు నిలబడతామని ఐసిస్ సందేశంగా కనిపిస్తోందని భావిస్తున్నారు.

సాజిదా అల్ రిశ్వాయ్ కేసులో.. మీరు సున్నీలను రక్షించకుంటే.. మేం ఉన్నామని ఓ సందేశం పంపించారట.

సాజిదా ఆల్ రిశ్వాయ్ ఐసిస్‌కి ముఖ్యమైన వ్యక్తిగా కనిపిస్తోంది. ప్రస్తుతం సాజిదా వయస్సు 60 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనే అవకాశాలు తక్కువే. అయినప్పటికీ ఐసిస్‌కు చెందిన అబూ బకర్ అల్ బాగ్దాదికి ఆమె విడుదల ముఖ్యమని తెలుస్తోంది. ఆమె విడుదల తమకు గొప్ప విజయంగా భావిస్తారు. బాగ్దాది, అబు జర్కావీలు సాజిదాకు సోదరులు.

అల్ ఖైదాకు సందేశం

ఐసిస్ నిత్యం సున్నీ వర్షన్‌లోనే మాట్లాడుతోందని అంటున్నారు. సాజిదా విడుదల జీహాదీలకు గెలుపు అని జర్కావి సందేశం ఇచ్చారు. జర్కావీ మాజీ అల్ ఖైదా సభ్యుడు. ఈ నేపథ్యంలో అల్ ఖైదాలోని తమ వర్గం వారిని అతను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

గంటల్లో జోర్డాన్ ప్రతీకారం

ఇస్లామిక్ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. రెండు రోజుల క్రితం జపాన్‌కు చెందిన రెండో పాత్రికేయుడి తల నరికి చంపిన ఉగ్రవాదులు.. జోర్డాన్‌కు చెందిన ఓ పైలట్‌ను సజీవంగా దహనం చేశారు. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీడియో దృశ్యాలను విడుదల చేశారు. ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యపై జోర్డాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అదుపులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరితీసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The killing of Jordanian pilot Maaz al-Kassasbeh and then the execution of Sajida Al-Rishwai have raised many questions. The biggest question that needs to be asked is how serious was the ISIS about the release of Sajida who they call as sister?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more