• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏనుగు దంతాల అమ్మకాన్ని నిషేధించిన దశాబ్దం తర్వాత కూడా ‘ఈ-బే’లో కొనసాగుతున్న అమ్మకాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఈ-బే ఆన్ లైన్ పోర్టల్ లో పశువుల కొమ్ముల పేరుతో ఏనుగు దంతాల అమ్మకాలు

ఈ-బే ఆన్ లైన్ పోర్టల్‌లో ఏనుగు దంతాలను పేరు మార్చి అమ్ముతున్నారు. ఏనుగు దంతాలను "బొవైన్ బోన్స్" (పశువుల కొమ్ములు) అనే పేరు పెట్టి అమ్ముతున్నట్లు బీబీసీతో పాటు కొంత మంది నిపుణులు చేసిన పరిశోధనలో బయటపడింది.

యూకే లోని ఈ-బే ఆన్ లైన్ పోర్టల్‌లో బీబీసీ మూడు రకాల ఉత్పత్తులను కొని ఒక స్వతంత్ర ల్యాబ్‌లో పరీక్ష చేయించింది. అందులో రెండు ఉత్పత్తుల్లో ఏనుగు దంతాలతో తయారైనట్లు తేలింది. ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వేల రకాల వస్తువులను ఈ పోర్టల్ లో అమ్ముతున్నట్లు ఏనుగు దంతాల వ్యాపార నిపుణులు చేసిన విశ్లేషణ తెలిపింది.

సంస్థ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు దశాబ్దం క్రితమే ప్రకటించినప్పటికీ ఈ అమ్మకాలు మాత్రం ఆగలేదు.

ఈ పరిశోధనను పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీలో డాక్టర్ కారోలిన్ కాక్స్ మొదలుపెట్టారు. యూకేలో ఏనుగు దంతాల విక్రయం పై ఇటీవల విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్‌లో ఈ వ్యాపారం కొనసాగుతుందేమోననే అనుమానంతో ఆమెతో పాటు ఇతర ఏనుగు దంతాల వాణిజ్య నిపుణులు ఆందోళన చెందారు. యూకేలో జూన్ 06 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది.

ఏనుగు దంతంతో చేసిన గాజు

అయితే, ఈ-బే ఏనుగు దంతాల విక్రయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆపేస్తున్నట్లు ప్రకటించి 10 సంవత్సరాలు అయింది.

అంతర్జాతీయ నిషేధం వల్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు, అంతరించిపోయే ప్రమాదమున్న జంతువులను కూడా సంరక్షిస్తుందని ఆన్‌లైన్ పోస్ట్‌లో సంస్థ పేర్కొంది.

2018లో కాక్స్ బృందం 3 నెలల పాటు ఈ-బే యూకే సైట్ లో "బొవైన్ బోన్" అనే విభాగంలో ఉన్న వస్తువులను ట్రాక్ చేస్తూ ఆన్‌‌లైన్‌లో అధ్యయనం నిర్వహించారు. ఈ బృందం 632 "బొవైన్ బోన్' ఉత్పత్తులను ట్రాక్ చేసింది. అందులో 500కు పైగా ఏనుగు దంతాలకు సంబంధించిన ఉత్పత్తులని తేలింది.

ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ ఫోరెన్‌సిక్ అధ్యయనానికి కొనుగోలుదారులకు, పరిశోధనకారులకు ఇచ్చే సమాచారం, ఫోటోలను వాడినట్లు డాక్టర్ కాక్స్ వివరించారు. ఇందులో ఇవి తయారయ్యేందుకు వాడిన మూల పదార్ధాల గురించి స్పష్టంగా పొందుపరిచి ఉంది.

"ఏనుగు దంతాలకు ఒక ప్రత్యేకమైన తెలుపు రంగు ఉంటుంది" అని వివరించారు.

"దంతాలతో పాటు పొందుపరిచిన వివరాల్లో వస్తువు బరువు కూడా ఉంటుంది. ఇది చాలా కచ్చితంగా ఉంటుంది. ఆ బరువును బట్టీ దంతాల విలువ ఉంటుంది" అని అన్నారు.

ఈ దంతాల ఫొటోల్లో కీలకమైన ఆధారం ఉంటుంది. చెక్కిన ఏనుగు దంతాలకు స్పష్టంగా, విభిన్నంగా కనిపించే గీతలుంటాయి. వీటిని స్క్రీగర్ లైన్స్ అని అంటారు.

"ఇవి చెట్టు కాండం పై ఉండే రంగులను తలపిస్తాయి. కానీ, ఇవి దంతాలకు, కొమ్ములకు ఉంటాయి. ఇవి ఏనుగు దంతాలకు మాత్రమే ఉంటాయి" అని డాక్టర్ కాక్స్ వివరించారు.

అక్రమంగా అమ్ముతున్న ఏనుగు దంతాలను పట్టుకునేందుకు, పరిశోధన చేసేందుకు కూడా పరిశోధకులు, అధికారులు ఈ మెళకువలనే వాడేవారు.

బొమ్మ

బీబీసీ న్యూస్ 2019లో ఈ-బేలో బొవైన్ బోన్ అనే లిస్ట్‌లో ఉన్న మూడు వస్తువులను కొని, స్వతంత్ర పరిశోధనశాలలో పరీక్షించింది.

ఆఫ్రికాలో తల పై ధరించే చెక్కిన ఒక చిన్న ఆభరణం, ఒక బ్రేస్‌లెట్, ఒక బొమ్మల జతను కొన్నారు. అందులో రెండు వస్తువులు ఏనుగు దంతాలతో తయారైనట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆర్కియాలజీ విభాగపు శాస్త్రవేత్తలు రసాయనికంగా ధృవీకరించారు.

బ్రేస్‌లెట్

అక్రమంగా జరుగుతున్న ఏనుగు దంతాల వ్యాపారాన్ని పరిష్కరించేందుకు ఈ-బే ఒక దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తున్నట్లు బీబీసీకి సమాధానమిచ్చింది.

"మా జంతు ఉత్పత్తుల విధానాన్ని అనుసరించి గత రెండేళ్లలో 265,000కు పైగా వస్తువులను బ్లాక్ చేయడం లేదా తొలగించాం" అని ఈ -బే ప్రతినిధి బీబీసీకి ఈ మెయిల్ ద్వారా సమాధానమిచ్చారు.

"ఏనుగు దంతాలను అక్రమ వ్యాపారం చేసేవారు కొన్ని రహస్య పదాలను వాడుతూ ఉంటారు.

2018లో మూడు నెలల కాలంలో ఈ-బే 500 ఏనుగు దంతాలకు సంబంధించిన ఉత్పత్తులను అమ్మినట్లు ఈ పరిశోధన నిర్వహించిన ఏనుగు దంతాల వ్యాపార నిపుణులు తెలిపారు. వీటిని అమ్మెందుకు బొవైన్ బోన్స్ (పశువుల కొమ్ములు)లాంటి కోడ్ పదాలు, లేదా మారు పేర్లను తరచుగా వాడారు.

ఏనుగు దంతాలకు సంబంధించిన చట్టాలు వివిధ దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. యూకేలో సోమవారం నుంచి ఏనుగు దంతాల విక్రయం పై కఠినమైన నిషేధం విధించింది. ఇది ప్రపంచంలోనే కఠినమైన నిషేధాలు విధిస్తున్న దేశాల్లో ఒకటి.

జూన్ 06 నుంచి ఏనుగు దంతాలు, కొమ్ముల వ్యాపారం చేయడం చట్ట వ్యతిరేకం మాత్రమే కాదు. ఈ నేరానికి 250,000 పౌండ్ల వరకు జరీమానా లేదా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

వన్య ప్రాణులకు సంబంధించిన ఉత్పత్తుల కోసం వెతుకులాట

వన్యప్రాణ ఉత్పత్తుల వ్యాపారులు కేవలం ఈ-బే ఆన్ లైన్ వేదికను మాత్రమే వాడలేదు. 2017లో అంతరించిపోతున్న పెంపుడు జంతువుల వ్యాపారం పై చేసిన పరిశోధనలో జంతువుల గురించి ఇన్స్టా గ్రామ్ లో ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది.

అయితే, ఆ పోస్టులను సంస్థ తర్వాత తొలగించింది.

ఈ ఏడాది ఏప్రిల్ చివరలో జంతు సంరక్షక ప్రచార సంస్థ ఆవాజ్ ఒక నివేదికను ప్రచురించింది. అందులో "129 వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన హాని చేసే సమాచారం ఫేస్ బుక్ లో ఉన్నట్లు తెలిపింది.

ఈ పోస్టుల్లో చిరుతపులులు, కోతులు, పాంగోలిన్, పాంగోలిన్ పొలుసు, సింహం పిల్లలు, ఏనుగు దంతాలు, రైనో కొమ్ములను అమ్మకానికి ఉన్నట్లు, కొనేందుకు కావల్సినట్లు ఉంది.

అయితే, ఈ నివేదికకు ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా సమాధానమిచ్చింది.

"అంతరించిపోతున్న వన్యప్రాణులు, వాటి శరీర భాగాల వ్యాపారాన్ని మేము నిషేధిస్తున్నాం. మెటా కొయలిషన్ టు ఎండ్ వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ ఆన్ లైన్" లో సభ్యత్వం కలిగి ఉంది.

ఈ ఆన్ లైన్ వేదికలకు విపరీతమైన రీచ్, ప్రభావం ఉంటాయి" అని ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇనీషియేటివ్ ఫౌండేషన్ సిఈ ఓ జాన్ స్కాన్ లాన్ చెప్పారు.

"వీటిని జాగ్రత్తగా పర్యవేక్షించని పక్షంలో, నేరస్థులు ఏ దేశంలోనైనా అక్రమంగా వ్యాపారం చేసేందుకు సాధనాలుగా మారతాయి.

ఆన్ లైన్ వేదికలు ఈ వ్యాపారాలను పర్యవేక్షిస్తామని హామీలిచ్చి, వాటిని నిలబెట్టుకోలేనప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి" అని అన్నారు.

"ఇటీవల కాలంలో చట్ట బద్ధమైన ఏనుగు దంతాల మార్కెట్‌లను కూడా మూసే విషయంలో అంతర్జాతీయ సమాజం చాలా పురోగతి సాధించింది. యూకేలో అమలు చేసిన చట్టం దీనికి ఒక ఉదాహరణ. కానీ, ఆన్‌లైన్ లో జరుగుతున్న వ్యాపారం, ఈ పురోగతికి ముప్పుగా పరిణమిస్తోంది".

ఏనుగులు

ఆఫ్రికాలోని ఏనుగులకు పొంచి ఉన్న ముప్పులో మార్పులు వస్తున్నాయని జంతు పరిరక్షకులు అంటున్నారు.

"కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మధ్య ఆఫ్రికాలో వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఏనుగు దంతాల వ్యాపారం ముప్పుగానే ఉంది.

కానీ, ఇది తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో బాగా తగ్గింది" అని స్కాన్‌లోన్ చెప్పారు.

"అయితే, పెరుగుతున్న మానవ జనాభాకు, ఆవాసాలకు వనరుల కోసం ఏనుగులకు మధ్య పెరుగుతున్న పోటీ మరింత పెద్ద ముప్పుగా మారిందని భావిస్తున్నాం. ముఖ్యంగా వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే తెలుస్తున్నాయి" అని ఆయన అన్నారు.

జాతీయ చట్టాలను కఠినం చేయడంతో మరిన్ని ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోకి చేరుతాయని డాక్టర్ కాక్స్, ఇతర వన్య ప్రాణుల నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

"ఈ- బే లాంటి సైట్లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అమ్మకం దారులకు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి" అని డాక్టర్ కాక్స్ వివరించారు.

వన్య ప్రాణులకు ముప్పుగా పరిణమించే వ్యాపారానికి వేదిక కావడం ద్వారా ఏనుగు దంతాల వ్యాపారం పై నిషేధం విధించడంలో సంస్థ విఫలమయింది" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sales on e-bay continue even after a decade of ivory sales have been banned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X