అంతర్జాతీయ వివాదంలో బాలీవుడ్ స్టార్!
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలో చేసి ఓ కామెంట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా.. ముఖ్యంగా సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. రియాద్‌లో జరిగిన 'జాయ్ ఫోరమ్ 2025' కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో వేదిక పంచుకున్న సల్మాన్ ఖాన్.. మధ్యప్రాచ్యంలో భారతీయ సినిమాల ఆదరణ గురించి మాట్లాడే క్రమంలో బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుంచి విడిగా ప్రస్తావించారు.
సల్మాన్ ఖాన్ అసలేమన్నారు?
మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేస్తున్న దక్షిణ ఆసియా వలసదారుల గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఇండియాలో తీసిన చిత్రాలు అక్కడ కూడా భారీ విజయాన్ని సాధిస్తాయని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వివిధ దేశాల నుంచి ప్రజలు ఉన్నారని వివరిస్తూ.. "అక్కడ (సౌదీ అరేబియాలో) బలూచిస్తాన్ నుంచి ప్రజలు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ప్రజలు ఉన్నారు... ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేస్తున్నారు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలో బలూచిస్తాన్, పాకిస్తాన్ పదాలను వేరుగా ఉచ్చరించడమే ఇప్పుడు ప్రధాన వివాదాంశంగా మారింది.

సోషల్ మీడియాలో భిన్న స్వరాలు.. ఉద్దేశమా? పొరపాటా?
సల్మాన్ ఖాన్ నోటి నుంచి వెలువడిన ఈ మాటపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్‌ల సమక్షంలో సల్మాన్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్య చేశారని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు ఇది కేవలం 'నోరు జారడం' లేదా ప్రాంతీయ పేర్లపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వచ్చిన పొరపాటు అని అంటున్నారు. మరోవైపు బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమకారులు ఈ కామెంట్‌ను తమ వాదనకు మద్దతుగా వాడుకుంటున్నారు. "బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశమని సల్మాన్ ఖాన్ కూడా అంగీకరించారు" అని ఓ యూజర్ పేర్కొన్నారు. జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ కూడా ఈ రెండు పదాలను సల్మాన్ విడిగా ప్రస్తావించడం 'అద్భుతం'గా అభివర్ణించారు.
Finally @BeingSalmanKhan acknowledged Balochistan is not Part of Pakistan ✌️❤️🙏
— Bilal Baloch (@bbfr74) October 18, 2025
Salam Khan said “ People of Balochistan, Afghanistan , Pakistan & everywhere”@BDUTT #Balochistan #Baloch pic.twitter.com/TgdqrZhzr6
"బాలీవుడ్ నుంచి మనం భౌగోళిక-రాజకీయ ఖచ్చితత్వాన్ని ఆశించకూడదు" అని మరికొందరు వాదించారు. ఈ వ్యాఖ్యను అతిగా విశ్లేషించాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ఒక నటుడు మాట్లాడిన మాట మాత్రమేనని అన్నారు.ఈ వివాదంపై సల్మాన్ ఖాన్ గానీ, ఆయన బృందం గానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
బలూచిస్తాన్ సంక్లిష్ట చరిత్ర: వివాదానికి మూల కారణం
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ కావడంతో పాటు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో (CPEC) కీలక ప్రాంతం. గ్వాదర్ పోర్ట్ ఇక్కడ ఒమన్ గల్ఫ్‌కు దగ్గరగా ఉంది. పాకిస్తాన్ గ్యాస్ ఉత్పత్తిలో 40 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైనదైనప్పటికీ ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ కేంద్ర నాయకత్వం నిర్లక్ష్యం చేసింది. దీని ఫలితంగా 1948లో పాకిస్తాన్‌లో విలీనం అయినప్పటి నుండి స్వాతంత్య్ర ఉద్యమం మొదలైంది..
బలూచ్ ప్రాంతం మూడు భాగాలుగా విభజించబడింది. ఉత్తర ప్రాంతం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో భాగం, పశ్చిమ ప్రాంతం (సిస్తాన్-బలూచిస్తాన్) ఇరాన్‌లో ఉంది. మిగిలిన భాగం పాకిస్తాన్‌లో ఉంది.
బలూచ్‌లు తమను విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించుకుందని లేదా విలీనం చేసుకుందని నమ్ముతారు. ఈ జాతి సమూహం పాకిస్తాన్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే పంజాబీలు, సింధీయుల కంటే భిన్నమైనది. అందుకే బలూచిస్తాన్ ఇప్పటికీ అస్థిరంగా ఉంది. పాకిస్తాన్ బలగాలను, చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో (CPEC) వంటి విదేశీ ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని నిరంతరాయంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications