స్వలింగ సంపర్కుల వివాహం: అస్ట్రేలియా పార్లమెంట్ ఓకే, 2018 ఫిబ్రవరిలో ఫస్ట్ మ్యారేజ్

Posted By:
Subscribe to Oneindia Telugu

మెల్‌బోర్న్: అస్ట్రేలియన్ పార్లమెంట్ స్వలింగ సంపర్కుల వివాహనికి అనుమతినిచ్చింది. 2018 ఫిబ్రవరి మాసంలో స్వలింగ సంపర్కుల తొలి వివాహం జరిగే అవకాశం ఉంది.

అస్ట్రేలియన్ పార్లమెంట్ స్వలింగ సంపర్కుల వివాహం విషయంలో కొత్త చట్టం తీసుకువచ్చింది. ఇటీవల ఈ చట్టంపై ఇద్దరు పార్లమెంట్‌లో చర్చ సాగింది.చర్చలో ఫాల్గొన్న ఎంపీ తన సహచరుడిని చూస్తూ బావోద్వేగానికి గురయ్యాడు.

ఎట్టకేలకు అస్ట్రేలియన్ పార్లమెంట్ స్వలింగ సంపర్కుల వివాహనికి గురువారం నాడు అనుమతినిచ్చింది. దీంతో స్వలింగ సంపర్కుల వివాహల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు.

స్వలింగ సంపర్క వివాహలకు అస్ట్రేలియా అనమతి

స్వలింగ సంపర్క వివాహలకు అస్ట్రేలియా అనమతి


స్వలింగ సంపర్క వివాహలకు అస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పార్లమెంట్‌లో కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే స్వలింగ సంపర్కుల వివాహం విషయంలో కొంత కాలంగా డిమాండ్ నెలకొంది. ఈ విషయమై అస్ట్రేలియన్ పార్లమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకొంది.

స్వలింగ సంపర్కులకు తొలి వివాహం ఫిబ్రవరిలో

స్వలింగ సంపర్కులకు తొలి వివాహం ఫిబ్రవరిలో


2018 ఫిబ్రవరిలో స్వలింగ సంపర్కులకు తొలిసారి వివాహమయ్యే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అస్ట్రేలియా పార్లమెంట్ స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకొనే వెసులుబాటు కల్పించే చట్టం విషయంలో అనేక తర్జన భర్జనలు చేసిన తర్వాత చట్టం చేసింది అస్ట్రేలియా పార్లమెంట్ .

12.7 మిలియన్ ప్రజలు అనుకూలంగా

12.7 మిలియన్ ప్రజలు అనుకూలంగా

8 వారాల పాటు సుమారు 12.7 మిలియన్ ప్రజల నుండి పోస్టల్ సర్వే ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో ప్రజలు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడానికి సానుకూలంగా స్పందించారు. దీంతో అస్ట్రేలియన్ పార్లమెంట్ ఈ విషయమై అనుకూలమైన చట్టాన్ని రూపొందించింది.

ప్రజల మద్దతుతోనే

ప్రజల మద్దతుతోనే


ప్రజల మద్దతుతోనే అస్ట్రేలియన్ పార్లమెంట్‌ స్వలింగ సంపర్కుల వివాహనికి అనుకూలంగా చట్టాన్ని చేసినట్టుగా అస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కోమ్ టర్న్‌బుల్ ప్రకటించారు. ఈ బిల్లుకు అనుకూలంగా ప్రజలు మద్దతిస్తున్న విషయాన్ని గుర్తించిన తర్వాత అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Australian Parliament on Thursday voted to allow same-sex marriage across the nation. The first wedding is likely to be held in February next year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి