Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉద్యోగుల జీతాలను నిలిపివేసిన శామ్‌సంగ్, 2009 తర్వాత ఇదే తొలిసారి

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ తన ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. 2015లో దక్షిణ కొరియాకు చెందిన ఉద్యోగుల వేతనాలను నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరేళ్లలో ఉద్యోగుల జీతాలు నిలిపివేయడం ఇదే తొలిసారి. స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో లాభాలు తగ్గడంతో జీతాల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Samsung Electronics to freeze salaries in Korea for first time since 2009

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ప్రత్యర్ధులైన ఆపిల్ సంస్ధ కొత్త ఐఫోన్లు, జియోమి వంటి చైనా ఫోన్ల పోటీతో మార్కెట్‌లో శామ్‌సంగ్ షేరు బాగా పడిపోయింది. ఈ క్రమంలో శామ్‌సంగ్ సంస్ధ 2011 తర్వాత మొదటి సారిగా వార్షిక లాభాల్లో తక్కువ లాభాలను నమోదు చేసింది.

చివరిసారిగా 2009లో శామ్‌సంగ్ ఉద్యోగుల జీతాలను నిలిపివేశాక, కంపెనీ ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడ్డ తర్వాత జీతాలు పెంచుకుంటూ వచ్చింది. అయితే ఈ వార్తలపై శామ్‌సంగ్ ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+