• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సానీ అబాచా: నైజీరియా మాజీ అధ్యక్షుడు కొల్లగొట్టిన వేల కోట్ల డబ్బు కోసం 20 ఏళ్లుగా సాగిన వేట...

By BBC News తెలుగు
|

సానీ అబాచా 1993లో సైనికు కుట్రతో నైజీరియా అధికార పగ్గాలు చేపట్టారు

సెప్టెంబరు 1999లో స్విస్ న్యాయవాది ఎన్రికో మోన్‌ఫ్రినికి జీవితాన్ని మరో 20 ఏళ్ల పాటు పూర్తిగా మార్చేసే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ గొంతు నైజీరియా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక వ్యక్తిది.

"ఆయన అర్ధరాత్రి ఫోను చేసి ఆయను ఉన్న హోటల్‌కు రాగలనేమోనని కనుక్కున్నారు. ఆయన దగ్గర చెప్పడానికి ఏదో ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడు చాలా ఆలస్యం అయిందని ఆయన అన్నారు. అయినా పర్వాలేదు" అని చెప్పాను.

ఆ డబ్బెక్కడుందో కనిపెట్టగలవా?

1993 నుంచి 1998 వరకు నైజీరియాను పాలించిన నైజీరియా అధ్యక్షుడు ఓలుసెగెన్ ఒబాసాంజో అబాచా దొంగిలించిన సొమ్మును తిరిగి తెచ్చేందుకు వ్యక్తిని నియమించమని ఆదేశిస్తూ ఆ అధికారిని పంపించినట్లు మోన్‌ఫ్రిని చెప్పారు.

ఒక న్యాయవాదిగా మోన్‌ఫ్రినికి నైజీరియాలో 1980 నుంచి కాఫీ, కోకో, ఇతర ఉత్పత్తుల్లో వ్యాపారం చేసే క్లయింట్లు ఉన్నారు. వారే అతని పేరును సూచించి ఉంటారని ఆయన అనుమానం

"నువ్వు ఆ డబ్బును కనిపెట్టగలవా? లేదా ఆ డబ్బును వినియోగం కాకుండా నిరోధించగలవా? ఆ డబ్బును నైజీరియాకు పంపే ఏర్పాట్లు చేయగలవా" అని ఆయన మోన్‌ఫ్రినిని అడిగినట్లు చెప్పారు.

"నేనందుకు అంగీకరించాను. కానీ, నిజానికి చేయాల్సిన పని గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ పనిని త్వరగా నేర్చుకోవలసి వచ్చింది. నేను నేర్చుకున్నాను కూడా" అని మోన్ఫ్రిని చెప్పారు.

పనిని మొదలుపెట్టడానికి ముందుగా, నైజీరియా పోలీసులు కొన్ని మూసేసిన స్విస్ బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇచ్చారు. అందులో అబాచా అతని సహచరులతో కలిసి దొంగలించిన డబ్బు ఉన్నట్లుగా తెలుస్తోంది అని మోన్‌ఫ్రిని రాసిన 'రికవరింగ్ స్టోలెన్ అసెట్స్' అనే పుస్తకంలో రాశారు.

అబాచా అతని సహచరులతో కలిసి 1.5బిలియన్ డాలర్లకు (10,956 వేల కోట్ల రూపాయలకు) పైగా డబ్బును దొంగలించినట్లు 1998లో ప్రాధమిక విచారణ తర్వాత పోలీసులు ప్రచురించిన నివేదికలోతెలిపారు.

ఎన్రికో మోన్‌ఫ్రిని

ట్రక్కు నిండా డాలర్లు

ఇంత పెద్ద మొత్తంలో డబ్బును సేకరించడానికి వారవలంబించిన విధానాలు మాత్రం చాలా రహస్యంగానే ఉన్నాయి. అబాచ అతని సలహాదారునితో ఒక భద్రతకు సంబంధించిన విషయం గురించి డబ్బును తెమ్మని అడిగేవారు.

ఆ తర్వాత ఆ అభ్యర్ధన పై ఆయన సంతకం చేసేవారు. అబాచ సలహాదారుడు ఆ అభ్యర్ధనను సెంట్రల్ బ్యాంకుకు తీసుకుని వెళ్లి ఆ డబ్బును ద్రవ్య రూపంలో తెచ్చిఇచ్చేవారు.

ఆ డబ్బునంతటినీ ఆయన అబాచ ఇంటికి పట్టుకుని వెళ్లి ఇచ్చేవారు. ఇలా అబాచా అతని సహచరులతో కలిసి చాలా సొమ్మును దొంగిలించారు. ఒక్కొక్కసారి కొంత డబ్బును ట్రక్కులలో కూడా తరలించేవారని మోన్‌ఫ్రిని రాశారు.

కొన్ని సార్లు ప్రభుత్వ కాంట్రాక్టులను వాళ్ళ స్నేహితులకు అధిక ధరలకు ఇస్తున్నట్లు చూపించి ఆ తేడాను సొమ్ము చేసుకునే వారు. తమ దేశంలో వ్యాపారం చేసేందుకు అవకాశం కల్పించడానికి విదేశీ సంస్థల నుంచి పెద్ద మొత్తాలలో లంచాలు వసూలు చేసేవారు.

అబాచా జూన్ 08 1998న అకస్మాత్తుగా చనిపోయేవరకు మూడేళ్ళ పాటు ఇదే పద్ధతి కొనసాగింది. ఆయన చనిపోయే నాటికి ఆయనకు 54 సంవత్సరాలు.

ఆయన గుండె పోటుతో మరణించారా లేదా ఎవరైనా విషం ఇచ్చి చంపారా అనే విషయంపై స్పష్టత లేదు. ఆయన మృత దేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించలేదని ఆయన వ్యక్తిగత డాక్టర్ చెప్పారు.

అయితే ఆయన దొంగిలించిన కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టక ముందే ఆయన మరణించారు. అయితే ఈ డబ్బును ఎక్కడ దాచి పెట్టారనే అంశం గురించి మాత్రం కొన్ని బ్యాంకు అకౌంట్లు కొన్ని కీలక ఆధారాలను అందించాయి.

ఆ అకౌంట్ల చరిత్ర తెలిపే కొన్ని పత్రాలు మరి కొన్ని ఇతర అకౌంట్ల గురించి తెలుసుకోవడానికి సహకరించాయని మోన్‌ఫ్రిని చెప్పారు.

ఈ సమాచారాన్ని ఆయన స్విస్ అటార్నీ జనరల్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దాంతో ఈ విషయంలో కాస్త పురోగతి కనిపించింది.

అబాచా కుటుంబం అతని సహచరులు ఒక నేర సంస్థను స్థాపించినట్లు మోన్ఫ్రిని వాదించారు. ఈ వాదన వాళ్ళ అకౌంట్లను పరిశీలించే విషయంలో అధికారులకు కీలకంగా నిలిచింది.

సానీ అబాచా

సానీ అబాచా ఎవరు?

పౌర యుద్ధంలో నైజీరియా సైన్యం తరపున పోరాడారు. ఆయన ఆగస్ట్ 1993కు ముందు రక్షణ మంత్రి అవ్వకముందు రెండు ముఖ్యమైన తిరుగుబాటులలో కీలక పాత్ర పోషించారు. నవంబరు 1993లో మిలటరీ తిరుగుబాటులో దేశాధినేత అయ్యారు.

ఆయన ప్రభుత్వంలో విపరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 1995లో తొమ్మిది మంది మానవ హక్కుల కార్యకర్తలను ఉరి వేసిన తర్వాత నైజీరియాను కామన్ వెల్త్ దేశాల సభ్యత్వం నుంచి తొలగించారు.

ఆయన అకస్మాత్తుగా 54 సంవత్సరాల వయస్సులో జూన్ 08 1998లో మరణించారు. ఆయనకు 10 మంది పిల్లలు.

స్విస్ అటార్నీ జనరల్ స్విట్జర్లాండ్లో ఉన్న అన్ని బ్యాంకులకు అబాచా పేరు మీద కానీ, మారు పేర్ల మీద కానీ అకౌంట్లు ఉన్నాయేమో పరిశీలించి వివరాలు వెల్లడించమని ఒక సాధారణ హెచ్చరికను జారీ చేశారు.

48 గంటలలో 95శాతం బ్యాంకులు, మరి కొన్ని ఆర్ధిక సంస్థలు ఆ కుటుంబానికి సంబంధించినవిగా అనిపిస్తున్న అకౌంట్ల వివరాలను వెల్లడించాయి.

ఈ వివరాలు అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు అకౌంట్ల వివరాలను తెలియచేసేందుకు ఉపయోగపడింది.

బ్యాంకులు ఆ పత్రాలను జెనీవాలో ప్రాసిక్యూటర్ కి ఇవ్వగా ఆ వ్యక్తికి సమయం లేకపోవడంతో నేనే ప్రాసిక్యూటర్ పాత్రను పోషించాల్సి వచ్చింది" అని మోన్ ఫ్రిని బీబీసీకి చెప్పారు.

"ప్రతీ అకౌంటులోనూ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది, అదెక్కడకు వెళ్ళిందనే అంశం గురించి మాకు అర్ధమైంది.

ఈ బ్యాంకు అకౌంట్లలోకి వచ్చి వెళ్లిన డబ్బు వివరాలు పరిశీలించాక ఇతర దేశాల నుంచి వచ్చిన చెల్లింపులు, పంపిన చెల్లింపుల గురించి అర్ధమయింది".

"ఈ మొత్తం వ్యవహారమంతా ఒక మంచు బంతిలా కనిపించింది. అది ముందు కొన్ని అకౌంట్లతో మొదలయి ఎక్కువ అకౌంట్లకు చేరి ఒక స్నో బాల్ ఎఫెక్ట్ (మంచు బంతిలా చుట్టుకునే) ప్రభావాన్ని సృష్టించింది. ఇదంతా భారీగా అంతర్జాతీయ స్థాయిలో జరిగినట్లు అర్ధమయింది".

"వాటితో పాటు బయట పడిన బ్యాంకు అకౌంట్లు, పత్రాలు ఇంకా చాలా వివరాలను బయటపెట్టాయి.

"చాలా డబ్బును బహమాస్, నసౌ, కేమన్ ఐలాండ్స్ లాంటి దేశాలకు పంపినట్లు ఆధారాలు దొరికాయి. ఈ దేశాల పేర్లకు అంతు లేదు" అని మోన్‌ఫ్రిని తెలిపారు.

అబాచా ఏర్పరిచిన నెట్‌వర్క్ విస్తృతి మోన్‌ఫ్రిని పనిని మరింత పెంచింది.

"దీని వెనక ఎంత పని చేయాల్సి ఉంటుందో ఎవరికీ అర్ధం కాలేదు. నేను ఈ సమాచారం కోసం చాలా మంది అకౌంటంట్లు వివిధ దేశాలలో ఉండే న్యాయవాదులకు చాలా చెల్లించాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.

నైజీరియాకి తిరిగి పంపించే డబ్బు పై 4 శాతం తనకు చెల్లించాలని మోన్‌ఫ్రిని ఒప్పందం చేసుకున్నారు. ఇది ఈ పనికి చాలా చౌక.

సానీ అబాచా

ఈ డబ్బును కనుగొనడానికి పట్టిన సమయం కంటే ఆ డబ్బును నైజీరియాకి తిరిగి పంపించడానికి ఎక్కువ సమయం పట్టింది.

"అబాచా కుటుంబీకులు కుక్కల్లా కొట్టుకోవడం మొదలుపెట్టారు. మేము చేసిన ప్రతి పని పైనా వారు అప్పీలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ఈ ప్రక్రియపూర్తి కావడానికి చాలా సమయం పట్టింది" అని మోన్‌ఫ్రిని చెప్పారు.

ఈ డబ్బును తిరిగి నైజీరియాకు అందచేయడం వలన తిరిగి డబ్బు చోరీకి గురవుతుందేమోననే భయాన్ని స్విస్ రాజకీయ నాయకులు వ్యక్తం చేశారు.

ఐదేళ్ల తర్వాత స్విట్జర్లాండ్ కొంత డబ్బును తిరిగి ఇచ్చింది.

2005 - 2007 మధ్యలో అబాచ కుటుంబపు స్విస్ బ్యాంకు అకౌంట్లలో దొరికిన 508 మిలియన్ డాలర్లను స్విట్జర్లాండ్ నైజీరియాకు పంపినట్లు మోన్ఫ్రిని రాశారు. 2018 నాటికి స్విట్జర్లాండ్ నైజీరియాకి తిరిగి ఇచ్చిన సొమ్ము 1 బిలియన్ డాలర్లకు చేరింది.

మిగిలిన దేశాలు డబ్బును తిరిగి పంపడంలో కాస్త జాడ్యం చేసాయి. లీచెన్స్టన్ లో జరిగింది మాత్రం మహా విపత్తు అని చెప్పవచ్చు. అదొక పీడ కల.

2014 జూన్లో లీచెన్స్టన్ నైజీరియా కి 277 మిలియన్ డాలర్లను పంపింది.

ఆరేళ్ళ తర్వాత మే 2020 జెర్సీ లోని ఛానల్ ఐలాండ్స్ లో ఉన్న అకౌంట్ల నుంచి 308 మిలియన్ డాలర్లను నైజీరియాకు పంపారు.

ఈ డబ్బును రెండవ నైజర్ బ్రిడ్జి, లాగోస్ ఇబాదన్ ఎక్ష్ప్రెస్ వే, అబూజా కానో రోడ్ నిర్మాణానికి వాడతామని నైజీరియా అధికారులు అంగీకరించిన తర్వాతే పంపడం జరిగింది

ఇంకా కొన్ని దేశాలు తిరిగి అప్పగించాల్సిన సొమ్ము ఉంది.

యూకె నుంచి ఒక 30 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ నుంచి 144 మిలియన్ డాలర్లు, జెర్సీ నుంచి మరో 18 మిలియన్ డాలర్లను తిరిగి రావాలని మోన్ఫ్రిని చూస్తున్నారు.

మొత్తం మీద ఆయన చేసిన పని వలన మొత్తం 2.4 బిలియన్ డాలర్లకు పైగా సమకూర్చగలిగారు.

అబాచా కుటుంబం దగ్గర ఇప్పుడు పెద్దగా ఆస్తులు లేవని ఆయన అనుకుంటున్నట్లు తెలిపారు.

"లేదా వారు గతంలోలా డబ్బులో ఈత కొట్టడం లేదు" అని అన్నారు.

"ఈ కేసు గురించి నేను నా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఆ డబ్బును నేను కనిపెట్టి దానిని నిరోధించానని చెబుతూ ఉంటాను. ఆ డబ్బును నైజీరియా ప్రజల కోసం తిరిగి పంపించేందుకు నేను అధికారులను ఒప్పించానని చెబుతాను" అని మోన్‌ఫ్రిని అన్నారు.

ఏమైనా, ఆయన చివరగా చెప్పే మాట, "మా పనిని మేం చేశాం."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sani Abacha: 20-year-old hunt for billions of rupees looted by former Nigerian president
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X